వార్మప్ మ్యాచ్: వికెట్ తీసిన ఆనందంలో కోహ్లీ సంబరాలు (వీడియో)


హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాట్‌తో అద్భుతమైన రికార్డులను నమోదు చేసినా... బౌలింగ్‌లో సైతం ఒక్క వికెట్ అన్నా తీయాలనేది విరాట్ కోహ్లీ కోరిక. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు 73 టెస్టులాడిన కోహ్లీ 27.1 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీ ఎట్టకేలకు సక్సెస్
అయితే, సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీ ఎట్టకేలకు సక్సెస్ అయ్యాడు. మూడో రోజు ఆటలో రెండు ఓవర్లు పాటు బౌలింగ్ వేసి వికెట్ తీయలేని విరాట్ కోహ్లీ.. శనివారం చివరి రోజు ఆటలో ఎట్టకేలకు వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. శనివారం సౌత్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ హ్యారీ నీల్సన్‌ను ఔట్ చేశాడు.
సెంచరీ చేసి జోరుమీదున్న హరీ నీల్సన్ వికెట్ తీసిన కోహ్లీ
170 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో సెంచరీ చేసి జోరుమీదున్న హరీ నీల్సన్ వికెట్ తీయడం విశేషం. కోహ్లీ సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. వికెట్ తీసిన అనంతరం తన సహచర ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీసీసీఐ తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంటూ "కెప్టెన్ వికెట్ తీసిన వేళ" అంటూ క్యాష్షన్ పెట్టింది.

ఏడు ఓవర్లు బౌలింగ్ వేసి వికెట్ తీసిన కోహ్లీ
ఈ మ్యాచ్‌లో మొత్తం ఏడు ఓవర్లు బౌలింగ్ వేసిన కోహ్లీ ఒక వికెట్ తీసి 27 పరుగులిచ్చాడు. అయితే కోహ్లీ బౌలింగ్ చేయడంపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. రెండో కొత్త బంతి వచ్చే ముందు బౌలర్లు అలిసిపోయినందున కొన్ని ఓవర్లు వేయాలని కోహ్లీ అనుకున్నాడని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా కోహ్లీ ఎనిమిది వికెట్లు తీశాడు.

544 పరుగులు చేసి ఆలౌటైన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు
వన్డే, టీ20, ఐపీఎల్ మ్యాచ్‌లలో ఈ వికెట్లు తీశాడు. 2016లో వెస్టిండీస్ ఆటగాడు జాన్సన్ చార్లెస్‌ను కోహ్లీ చివరిసారి ఔట్ చేశాడు. ఇదిలా ఉంటే, వార్మప్ మ్యాచ్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 544 పరుగులు చేసి ఆలౌటైంది. హ్యారీ నీల్సన్(100) సెంచరీతో రాణించగా, షార్ట్ ( 74), మ్యాక్స్ బ్రయాంట్ ( 62), అరోన్ హార్డీ(86)లు హాఫ్ సెంచరీలతో రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications