Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: స్వదేశంలో సచిన్ రికార్డుకి సెంచరీ దూరంలో విరాట్ కోహ్లీ

India vs Australia: Virat Kohli sets eye on big record of Sachin Tendulkar

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేశాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ముంబై వేదికగా మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన వన్డే ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేయనున్నాడు.

భారత్‌లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్(20 సెంచరీలు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, ఇప్పుడు ఆ రికార్డుకి ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరువయ్యాడు. స్వదేశంలో ఇప్పటివరకు 19 సెంచరీలు చేసిన కోహ్లీ మరో సెంచరీ చేస్తే సచిన్ సరసన నిలుస్తాడు.

మూడు వన్డేల సిరిస్ కోసం

మూడు వన్డేల సిరిస్ కోసం

మూడు వన్డేల సిరిస్ కోసం ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని టీమిండియా ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. భారత పర్యటనలో భాగంగా మంగళవారం వాంఖడె వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గనుక సెంచరీ సాధిస్తే సొంతగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన సచిన్ రికార్డుని సమం చేస్తాడు.

11వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా

11వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా

ఇటీవలే పూణె వేదికగా శ్రీలంకతో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతంగా 11వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం శ్రీలంకతో మూడో టీ20లో తొలి పరుగు తీసి కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు.

169 మ్యాచ్‌ల్లో కోహ్లి 11వేల అంతర్జాతీయ పరుగులు

169 మ్యాచ్‌ల్లో కోహ్లి 11వేల అంతర్జాతీయ పరుగులు

కెప్టెన్‌గా 169 మ్యాచ్‌ల్లో కోహ్లి 11వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు. కెప్టెన్‌గా 11వేలు, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన జాబితాలో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(న్యూజిలాండ్‌), ధోని(భారత్‌), అలెన్‌ బోర్డర్‌(ఆస్ట్రేలియా), గ్రేమ్‌ స్మిత్‌(దక్షిణాఫ్రికా), రికీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా)లు ఉన్నారు. కాగా, భారత్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన రెండో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

ధోని తర్వాత విరాట్ కోహ్లీనే!

ధోని తర్వాత విరాట్ కోహ్లీనే!

కోహ్లీ కంటే ముందు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా 11వేలకు పైగా అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు. రికీ పాంటింగ్‌ 324 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 15,440 పరుగులు చేయగా, గ్రేమ్‌ స్మిత్‌ 286 మ్యాచ్‌ల్లో 14, 878 పరుగులు చేశాడు. ఫ్లెమింగ్‌ 303 మ్యాచ్‌ల్లో 11,561 పరుగులు చేయగా, ధోని 332 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 11, 207 పరుగులు సాధించాడు.

Story first published: Monday, January 13, 2020, 16:58 [IST]
Other articles published on Jan 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+