న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చహల్‌ను తీసుకోవాలనే ఆలోచనే లేదు.. కానీ ఈరోజు అదే కలిసివచ్చింది: కోహ్లీ

India vs Australia: Virat Kohli says Concussion substitute worked well for us
Ind vs Aus 2020,1st T20 : 'Concussion Substitute Worked For Us' - Virat Kohli

కాన్‌బెర్రా: శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో యుజ్వేంద్ర చహల్‌ను తీసుకోవాలనే ఆలోచనే లేదని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు జరిగిన తొలి టీ20 మ్యాచులో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను 150 పరుగులకే పరిమితమైంది. చహల్‌ 3/25, టీ నటరాజన్‌ 3/30 అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయింది. అంతకుముందు రవీంద్ర జడేజా (44; 23 బంతుల్లో 5x4, 1x6), కేఎల్ రాహుల్ (51; 40 బంతుల్లో, 5×4, 1×6) చెలరేగడంతో ఆస్ట్రేలియాకు భారత్‌ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఈ మ్యాచులో చహల్‌ను తీసుకోవాలనే ఆలోచనలే లేవు. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అనేది విచిత్రమైన పరిస్థితి. అయితే ఈరోజు అది మాకు కలిసివచ్చింది. ఆసీస్‌ను చిత్తు చేయడంలో చహల్‌ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థి జట్టుకు చహల్‌ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు' అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత చహల్‌ తుది జట్టులో లేడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు బ్యాటింగ్‌ చేసిన జడేజాకు చివరి ఓవర్‌లో తలకు గాయమవడంతో చహల్‌ కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసిన చహల్‌.. కీలక బ్యాట్స్‌మెన్‌లను ఔట్‌ చేశాడు. తన కోటా 4 ఓవర్లో 25 రన్స్ ఇచ్చి అద్భుత ప్రదర్శన చేశాడు.

'నిజం చెప్పాలంటే ఆసీస్‌కు ఆరంభం బాగుంది. కానీ ఒత్తిడికి లోనై ఓటమి పాలయ్యారు. వారికి వారే స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయారు. అదే టీ20 క్రికెట్‌. ఆస్ట్రేలియాలో ఆట అనేది చాలా కఠినంగా ఉంటుంది. కడవరకూ పోరాటం సాగిస్తేనే గెలుస్తాం. టీ నటరాజన్‌ ప్రతీ మ్యాచ్‌కు మెరగవుతున్నాడు. దీపక్ చహర్‌ కూడా బౌలింగ్‌ బాగా వేశాడు. కాకపోతే మ్యాచ్‌ తిరిగి చేతుల్లోకి రావడానికి కారణం మాత్రం కచ్చితంగా చహలే. ఈ మ్యాచ్‌లో ఫించ్‌ ఇచ్చిన క్యాచ్‌ను హార్దిక్‌ పాండ్యా అందుకున్న తీరు అమోఘం. అదే మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభం కావడానికి 10-15 నిమిషాల ముందు నువ్వు మ్యాచ్ ఆడబోతున్నావని టీమ్ మేనేజ్మెంట్ చెప్పారని మ్యాచ్ అనంతరం యుజ్వేంద్ర చహల్ వెల్లడించాడు. వన్డే తప్పిదాలతో పాఠాలు నేర్చుకున్నాని, ఆడం జంపా బౌలింగ్ చేసే విధానం చూసి తాను కూడా అలా ప్రయత్నించానన్నాడు. ఫించ్, స్మిత్ వికెట్లను తీయడం ఆనందాన్నిచ్చిందని, ప్రణాళికలను అమలు చేయగలిగానని చహల్ పేర్కొన్నాడు.

ప్లేయింగ్ 11లో లేకున్నా.. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్న తొలి క్రికెటర్ మనోడే!!ప్లేయింగ్ 11లో లేకున్నా.. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్న తొలి క్రికెటర్ మనోడే!!

Story first published: Friday, December 4, 2020, 20:53 [IST]
Other articles published on Dec 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X