మెరుగైన రికార్డు: ఆతిథ్య జట్టుని కలవరపెడుతోన్న కోహ్లీ అడిలైడ్ గణాంకాలు


హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా మరో కఠిన సవాల్‌కు సిద్ధం కాబోతుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరిస్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై రెండు హాఫ్ సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి తోడుగా మిగతా బ్యాట్స్‌మెన్ రాణిస్తే ఈ టెస్టు సిరిస్‌ను భారత్ సొంతం చేసుకోవడం ఖాయమని మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. అయితే, ఆసీస్‌ను ఆసీస్ గడ్డపై ఓడించడం అంత సులువు కాదు.

ఒక్కసారి కూడా టెస్టు సిరిస్‌ను గెలవని టీమిండియా
గత 40 ఏళ్లలో అనేకసార్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆ గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరిస్‌ను గెలవలేదు. అయితే, మునుపటితో పోలిస్తే టీమిండియా బలంగా ఉండటంతో పాటు ఆసీస్ స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు బాల టాంపరింగ్ కారణంగా జట్టుకు దూరం కావడంతో బలహీనంగా కనిపిస్తోంది.

అడిలైడ్‌లో కోహ్లీకి మెరుగైన రికార్డు
దీనికి తోడు తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న అడిలైడ్ స్టేడియంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ సగటుకు దాదాపు సమానంగా అడిలైడ్‌లో కోహ్లి యావరేజ్ ఉండటం విశేషం. ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 98.50 సగటుతో 394 పరుగులు చేశాడు.

బలహీనంగా కనిపిస్తోన్న ఆస్ట్రేలియా
ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. స్మిత్, వార్నర్ లాంటి ఆటగాళ్లు లేకపోవడం, మిగతా ఆటగాళ్లు కూడా పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా ఉంది. అడిలైడ్‌లో కోహ్లీకి అద్భుతమైన బ్యాటింగ్ రికార్డు ఉండటం ఆస్ట్రేలియాను కలవపాటుకు గురి చేస్తోంది.

2012లో ఒత్తిడి మధ్య బరిలోకి దిగి సెంచరీ
2012లో ఒత్తిడి మధ్య అడిలైడ్ టెస్టులో బరిలో దిగిన విరాట్ కోహ్లీ ఆసీస్ పేసర్లను ఎదుర్కొని 116 పరుగులు చేశాడు. అనంతరం రెండేళ్ల తర్వాత కెప్టెన్‌గా వెళ్లిన విరాట్ కోహ్లీ అడిలైడ్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో (169, 141 పరుగులు) సెంచరీలు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీలతో రాణించినా... ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.
డ్రా దిశగా వార్మప్ మ్యాచ్
కాగా, సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు 6 వికెట్లకు 356 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. దీంతో ఈ మ్యాచ్ డ్రా అయ్యే విధంగా కనిపిస్తోంది.
గాయం కారణంగా తొలి టెస్టుకు పృథ్వీ షా దూరం
అయితే ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించాలని ఊవిళ్లూరుతోన్న టీమిండియాకు ఇది ఎదురదెబ్బే. అందుకు కారణం తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు ఆధిక్యం దిశగా దూసుకెళ్లడమే. కాగా, ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్టుకు అతడు దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications