For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌.. కోహ్లీ ప్రదర్శించిన తీరు అద్భుతం

ICC Cricket World Cup 2019 : Virat Kohli’s Gesture Defending Him At Oval Was ‘lovely’ Says Smith
India vs Australia: Virat Kohli’s gesture defending him at Oval was lovely says Steve Smith

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతడు ప్రదర్శించిన తీరు అద్భుతం అని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ కొనియాడారు. ప్రపంచకప్‌లో భాగంగా ఓవల్ వేదికగా ఈ నెల 9న భారత్‌, ఆసీస్‌ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా.. అభిమానులు స్మిత్‌ను కించపరిచేలా వ్యాఖ్యానించారు. బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్‌ వివాదాన్ని ప్రస్తావిస్తూ 'చీటర్‌, చీటర్‌' అంటూ గేలి చేశారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దేశం కోసం పోరాడుతున్నాడు:

అదే సమయంలో క్రీజులో బ్యాటింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ దీనిని గమించి హార్ధిక్‌ పాండ్యా ఔటైన తర్వాత ప్రేక్షకులను ఉద్దేశిస్తూ అలా ప్రవర్తించవద్దంటూ కోరాడు. స్టీవ్ స్మిత్‌‌ను చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. అనంతరం స్మిత్‌, కోహ్లీ కరచాలనం చేసుకున్నారు. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత అభిమానుల తరఫున క్షమాపణలు చెప్పాడు. 'జరిగిందేదో జరిగిపోయింది. అతను పునరాగమనం చేశాడు. వారి దేశం కోసం పోరాడుతున్నాడు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

కోహ్లీ తీరు అద్భుతం:

కోహ్లీ తీరు అద్భుతం:

సోమవారం ఈ విషయంపై స్టీవ్‌ స్మిత్‌ స్పందించాడు. ఆసీస్ పత్రిక సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌తో మాట్లాడుతూ... 'భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. అభిమానుల గెలిచేసిన సమయంలో కోహ్లీ ప్రదర్శించిన తీరు అద్భుతం. అయితే అభిమానులు ఏమనుకున్నా నేను పెద్దగా పట్టించుకోను. ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయా' అని స్మిత్‌ అన్నాడు.

మూడు హాఫ్ సెంచరీలు:

మూడు హాఫ్ సెంచరీలు:

స్టీవ్ స్మిత్ బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో ఇరుక్కుని ఏడాది పాటు నిషేదానికి గురైన విషయం తెలిసిందే. నిషేధం అనంతరం స్మిత్‌ నేరుగా ప్రపంచకప్‌లో ( అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో) ఆడుతున్నాడు. నిషేధం పూర్తికాకముందే ఆసీస్, భారత టీ20 లీగుల్లో స్మిత్ ఆడాడు. అక్కడ మోస్తరుగా రాణించినా.. ప్రపంచకప్‌లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 243 పరుగులు చేసాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విండీస్ జట్టుపై చేసిన 73 పరుగుల ఇనింగ్స్ కీలకం. ఇక స్మిత్‌ అత్యధిక పరుగుల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, June 18, 2019, 14:37 [IST]
Other articles published on Jun 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+