
అడిలైడ్: నాలుగు టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ (డే/నైట్)లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. ఆసీస్ పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ 123 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ వేసిన 61వ ఓవర్ మొదటి బంతికి సింగల్ తీసిన కోహ్లీ.. అర్ధ శతకం మార్క్ అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో కోహ్లీకిది 23వ అర్ధశ తకం కావడం విశేషం. ప్రస్తుతం కోహ్లీ ఆచితూచి ఆడుతున్నాడు. మరోవైపు అజింక్య రహానే కూడా తన సహజ శైలిలో ఆడుతూ.. కోహ్లీకి మంచి సహకారం అందిస్తున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. యువ ఓపెనర్ పృథ్వీ షా తొలి ఓవర్ రెండో బంతికే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. స్టార్క్ గుడ్ లెంగ్త్ రూపంలో ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతిని సంధించగా.. ఏమాత్రం పాదాల కదలిక లేకుండా కవర్స్ దిశగా హిట్ చేసేందుకు షా ప్రయత్నించాడు. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వచ్చి మిడిల్ స్టంప్‌ని గీరాటేసింది. దాంతో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకుండానే టీమిండియా వికెట్ చేజార్చుకుంది.
ఆపై గులాబి బంతిని ఎందుక్కొనేందుకు భారత బ్యాట్స్‌మెన్ అంతా రక్షణాత్మక విధానమే అనుసరించారు. మయాంక్ అగర్వాల్ (17; 40 బంతుల్లో 2×4), చెతేశ్వర్ పుజారా (43; 160 బంతుల్లో 2×4) మరో వికెట్ పడకుండా చూశారు. ఇన్నింగ్స్ గాడిలో పడే సమయానికి మయాంక్ పెవిలియన్ చేరాడు. అయితే పుజారా మాత్రం ఆసీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కోహ్లీ కూడా చెత్త బంతులకు మాత్రమే పరుగులు చేశాడు. కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పుజారా అర్ధశతకం ముందు ఔట్ అయ్యాడు.
ఈ సమయంలో విరాట్ కోహ్లీకి అజింక్య రహానే జత కలిశాడు. రహానే కూడా ఆసీస్ పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు చేస్తున్నాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ గాడిలో పడింది. ప్రస్తుతం భారత్ 70 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది. క్రీజులో కోహ్లీ (66), రహానే (20) పరుగులతో ఉన్నారు.
'బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారే.. సరైన పిచ్ తగిలితే ఆసీస్‌కు ఉంటది..
https://telugu.mykhel.com/cricket/shane-bond-said-jasprit-bumrah-will-be-a-key-player-for-india-in-test-series/articlecontent-pf54394-032147.html