తలపై కోహ్లీ ముఖ చిత్రం.. వీరాభిమాని హెయిర్‌స్టైల్!!

ముంబై: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా మాజీలతో సహా కోట్లాది మంది ఫ్యాన్స్ కోహ్లీని అభిమానిస్తారు. కోహ్లీపై ఉన్న అభిమానాన్ని చూపడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నం చేస్తారు. మైదానంలో బారికేడ్స్ దాటి కొందరు ఫ్యాన్స్ కోహ్లీని కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే ఓ అభిమాని ఒంటినిండా టాటూలు వేసుకొని కోహ్లీని ఆశ్చర్యపరిచాడు. మరో అభిమాని పాత ఫోన్లతో కోహ్లీ ఫొటో గీశాడు.

తలపై కోహ్లీ ముఖ చిత్రం:
విరాట్ కోహ్లీని అత్యంత ఎక్కువగా ఇష్టపడే మరో అభిమాని వాంఖడే స్టేడియంలో కనిపించాడు. అయితే అతని హెయిర్‌స్టైల్ అక్కడి వారందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. చిరాగ్ ఖిలరే అనే వ్యక్తి తన తల వెనుకభాగంలో కోహ్లీ ముఖంని పోలినట్లు ఉండే విధంగా తన హెయిర్‌స్టైలింగ్ చేయించుకున్నాడు. అంతేకాక.. దాన్ని ఫొటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'ది బెస్ట్ విరాట్.. మనస్సు నుంచి తలవరకూ' అంటూ క్యాప్షన్ పెట్టాడు.

చాలా ఏళ్లుగా కోహ్లీని ఫాలో అవుతున్నా:
చిరాగ్ ఖిలరే హెయిర్ కట్‌ను స్టేడియంలోని టీవీలలో చూపించడం, ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అతను ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. తన హెయిర్ కట్‌పై చిరాగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ... 'నేను చాలా ఏళ్లుగా కోహ్లీని ఫాలో అవుతున్నా. కోహ్లీ ఆడిన ప్రతి మ్యాచ్‌ని చూస్తాను. అండర్-19 జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నప్పటి నుంచే కోహ్లీకి నేను అభిమానినయ్యా. తలపై కోహ్లీ ముఖ చిత్రాన్ని రూపొందించడానికి హెయిర్‌స్టైలిస్ట్ 6-8 గంటల సమయం తీసుకున్నాడు. ఈ సందర్భంగా అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నా' అని అన్నాడు.

విరాట్‌ను కలవడం నా కల:
విరాట్ కోహ్లీని కలవాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా. కానీ.. అతడిని కలుసుకునే అవకాశం రావడం లేదు. విరాట్‌ను కలవడం నా కల. నేను అతన్ని కలిసినప్పుడు ముందు అతని కాళ్లను ముట్టుకొని.. ఆ తర్వాత అతన్ని కౌగిలించుకుంటాను. ఆ జ్ఞాపకాన్ని ఓ ఫొటోగ్రాఫ్‌లో బంధిస్తాను' అని చిరాగ్ తెలిపాడు. విరాట్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు వెళ్లే అతనికి.. తన అభిమాన క్రికెటర్‌ని కలిసే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు.
పాత మొబైల్ ఫోన్లతో చిత్రపటం:
గవాహటికి చెందిన విరాట్ కోహ్లీ అభిమాని రాహుల్. కోహ్లీ అంటే అతనికి పిచ్చి. దీంతో పాత మొబైల్ ఫోన్లతో కోహ్లీ చిత్రపటం రూపొందించాడు. ఇది చూడడానికి సాధారణ పేపర్‌పై గీసిన బొమ్మలా ఉండడం విశేషం. కోహ్లీసేన శ్రీలంకతో జరిగిన తొలి టీ20 కోసం గువాహటిలో ఉండగా అక్కడి హోటల్‌లో కోహ్లీని కలిసిన రాహుల్.. ఆ చిత్రపటాన్ని చూపించాడు. అభిమాని రూపొందించిన తన చిత్రాన్ని చూసి ఫిదా అయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications