బహుశా నీ మాటలు అతడిని బాధించి ఉంటాయి: కోహ్లీ

మెల్‌బౌర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటతోనే కాకుండా కవ్వింపులతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, పంత్ మధ్య స్లెడ్జింగ్ గురించి అందరికీ తెలిసిందే. వికెట్ల వెనుక నిలబడి బ్యాట్స్‌మెన్‌ను కవ్విస్తోన్న పంత్.. ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్‌ను కూడా స్లెడ్జింగ్ చేశాడు. ఈ వ్యవహారంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం పాలు పంచుకోవడం గమనార్హం. బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఓటమికి దగ్గరల్లో ఉన్నప్పుడు జరిగిన సన్నివేశమిది.

లయన్ ఏకాగ్రతకు భంగం కలిగించాలని
భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు 215 పరుగులకే 8 వికెట్లు చేజార్చుకుంది. అయితే నాథన్ లైయన్ (6 బ్యాటింగ్; 38 బంతుల్లో) సహకారంతో పాట్ కమిన్స్ (61 బ్యాటింగ్; 103 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సు) ధాటిగా ఆడాడు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 43 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులో నిలదొక్కుకున్న లయన్ ఏకాగ్రతకు భంగం కలిగించాలని పంత్ నిర్ణయించుకున్నాడు.
నువ్వంటే కూడా నాకిష్టం రిషబ్
‘కమాన్ గ్యారీ, ఏం లేనిదాని కోసం ఐదో రోజు రావాలనుకోవు' అని లైయన్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. పంత్ ఏమన్నాడో అర్థంకాని లియాన్ అతడిని చూసి ఏమనాలని అనుకుంటున్నావో చెప్పమన్నాడు. పంత్ మరోసారి అదే మాట అన్నాడు. కానీ లియాన్‌కు ఈసారి కూడా అర్థం కాలేదు. దీంతో ‘నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు, నువ్వంటే కూడా నాకిష్టం రిషబ్' అని అన్నాడు. లెగ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న ఆ వెంటనే కోహ్లీ రంగంలోకి దిగాడు. హిందీలో పంత్‌తో సరదాగా ‘బహుశా నీ మాటలు అతడిని బాధించి ఉంటాయి' అని అన్నాడు.

పంత్ 19 వికెట్లలో భాగస్వామ్యం
మెల్‌బౌర్న్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పంత్ 19 వికెట్లలో భాగస్వామ్యం పంచుకున్నాడు. తద్వారా ఓ సిరీస్‌లో అత్యధిక ఔట్లలో భాగం పంచుకున్న భారత వికెట్ కీపర్‌గా నరేన్ తమ్హనే, సయ్యద్ కిర్మాణీల సరసన చేరాడు. ఈ విషయంలో ధోనీని సైతం దాటేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications