For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీఏ ప్రకటించిన జట్టుని చూడలేదు.. మాక్స్‌వెల్ సిరీస్‌లో లేకపోవడంతో ఆశ్చర్యపోయా: కోహ్లీ

India vs Australia: Virat Kohli quizzed Aaron Finch after Glenn Maxwell omission from ODIs

ముంబై: చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ గెలవగా.. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలిచింది. ఇదిలా ఉంటే.. వాంఖడే‌లో జరిగిన తొలి వన్డే సమయంలో ఆస్ట్రేలియా జట్టుని పేపర్‌పై చూసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడట.

14 మందితోనే జట్టు:

14 మందితోనే జట్టు:

ప్రతి క్రికెట్ మ్యాచ్‌లో టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు తుది జట్టుని ప్రకటిస్తారు. టాస్ టైమ్‌లో మ్యాచ్‌లో ఆడే 11 మంది ఆటగాళ్లతో పాటు రిజర్వ్ బెంచ్‌పై ఉండే నలుగురు ఆటగాళ్ల పేర్లని పేపర్‌పై రాసి ఉంచుతారు. టాస్ సమయంలో అధికారికంగా ఇరు జట్ల కెప్టెన్లు తమ తుది జట్టుని తెలిపే పేపర్లని మ్యాచ్ రిఫరీ సమక్షంలో ఒకరికొకరు మార్చుకుంటారు. అయితే ముంబై వన్డే సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఇచ్చిన పేపర్‌ను చూసి కోహ్లీ ఆశ్చర్యపోయాడు. 14 మందితోనే జట్టు ఉండటంతో.. గ్లెన్ మాక్స్‌వెల్ ఇక్కడ ఉన్నాడా? అని ఫించ్‌ని అడిగాడట.

మాక్స్‌వెల్ ఇక్కడే ఉన్నాడా?:

మాక్స్‌వెల్ ఇక్కడే ఉన్నాడా?:

మాక్స్‌వెల్ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీనే ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కోహ్లీ మాట్లాడుతూ... 'వన్డే సిరీస్‌ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టుని అప్పటివరకు చూడలేదు. టాస్ సమయంలో 14 మందితోనే జట్టు ఉండటంతో ఆశ్చర్యపోయా. జట్టులో 14 మందే ఉన్నారు, మాక్స్‌వెల్ ఇక్కడే ఉన్నాడా? అని ఫించ్‌ని అడిగా. ఫామ్‌లో ఉన్న అతను సిరీస్‌లో లేకపోవడంపై నన్ను విస్మయానికి గురిచేసింది. గత పర్యటనలో అతడు సెంచరీ చేసాడు. మాక్స్‌వెల్ జట్టులో ఉంటే.. ఆసీస్‌కి కచ్చితంగా ఉపయోగపడేవాడు' అని అన్నాడు.

 బీబీఎల్ టోర్నీతో బిజీ:

బీబీఎల్ టోర్నీతో బిజీ:

'ఆస్ట్రేలియాలో జరుగుతున్న దేశవాళీ టోర్నీ బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో మాక్స్‌వెల్ ఆడుతున్నాడు. ఆ టోర్నీలో చాలా బిజీగా గడుపుతున్నాడు. బీబీఎల్ కారణంగానే భారత పర్యటనకి అతడు దూరంగా ఉన్నాడు' అని కోహ్లీకి ఫించ్ సమాధానం ఇచ్చాడు. బీబీఎల్ టోర్నీకి ముందు మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా క్రికెట్‌ నుంచి మాక్స్‌వెల్ స్వల్ప విరామం తీసుకున్న విషయం తెలిసిందే. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్ జరుగుతుండగానే అర్ధంతరంగా తప్పుకున్నాడు.

టీ20ల్లో మూడు సెంచరీలు:

టీ20ల్లో మూడు సెంచరీలు:

మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం వన్డేలు, టీ20ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు కూడా ఆడాడు. ఇప్పటివరకు 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్‌ 2,877 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 61 టీ20లు ఆడి 1,576 పరుగులు చేసాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Tuesday, January 21, 2020, 14:13 [IST]
Other articles published on Jan 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+