
ఈ ఓటమి ఓ గుణపాఠం:
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మా పర్యటన ఇక్కడితో ముగియలేదు. ఇంకా మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒక కెప్టెన్‌గా వన్డే సిరీస్ ఓడిపోవడం నిరాశను కలిగించింది. అయినా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్ ఓటమి మాకు ఒక గుణపాఠం. మనసు పెట్టి ఆడితే విజయం సాధిస్తామని మూడో వన్డే విజయం ద్వారా అర్థమైంది. ఆటలో దెబ్బలు తగిలితేనే గాయం విలువేంటో తెలుస్తుంది. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాం. సిరీస్ ఓడిపోయినంత మాత్రానా మేము పూర్తిగా కోల్పోయినట్లు కాదు. ఈ ఓటమే రానున్న మ్యాచ్‌ల్లో మాకు విజయాలను అందిస్తుందని ఆశిస్తున్నా' అని అన్నాడు.

ఆ సమయంలో కాస్త వెనకపడ్డాం:
'ఈరోజు మా ఆటతీరులో మార్పు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మేము బ్యాటింగ్ చేసిన తొలిసగం, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ రెండవ భాగంలో కాస్త వెనకపడ్డాం. ఓపెనర్‌గా అవకాశం ఇచ్చిన శుభమన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. శిఖర్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన గిల్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. అయితే భారీ స్కోరు చేయలేకపోయాడు. నిజానికి మా బ్యాట్స్మన్లు అందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అయ్యర్, రాహుల్, జడేజా, పాండ్యాలతో బ్యాటింగ్ లైనఫ్ పటిష్టంగా ఉంది' అని విరాట్ కోహ్లీచెప్పాడు.

పాండ్యా, జడేజాలు ఆట అద్భుతం:
'ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శనను పక్కడ పెడితే.. పాండ్యా, జడేజాలు ఆడిన తీరు అద్భుతం. నేను ఔటైన తర్వాత వారిద్దరు నిలదొక్కుకొని జట్టుకు 300 పరుగుల స్కోరు అందించడం గొప్ప విషయం. ఆస్ట్రేలియా వంటి జట్టుపై ఆడుతున్నప్పుడు అలాంటి బూస్ట్ అవసరం. పిచ్ చూసిన తర్వాత మాకు గెలుస్తామనే నమ్మకం కలిగింది. ఈరోజు కాస్త బౌలర్లకు అనుకూలించింది. బుమ్రా, శార్దూల్, సైనీ, నటరాజన్‌లతో పేస్ విభాగం పటిష్టంగా కనిపించినా.. ఇక్కడి పిచ్‌లు బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉండడంతో మా బౌలర్లు తేలిపోయారు. అంతేకాని మా బౌలర్లు విఫలమయ్యారంటే ఒప్పుకోను. ఎందుకంటే ఆసీస్ బౌలర్లు కూడా అంత గొప్పగా రాణించలేదు. రానున్న మ్యాచులలో మా విజయ పరంపర కొనసాగిస్తాం' అని టీమిండియా కెప్టెన్ చెప్పుకోచ్చాడు.
ఐపీఎల్ ఆడినంత మాత్రాన.. ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తారా?: షేన్ వార్న్ ఫైర్