భువీ.. బుమ్రాలు ప్రతి బాల్‌ను అంచనా వేయగలరు: కోహ్లీ

బ్రిస్బేన్: సొంతగడ్డపై రాణించినట్లుగానే విదేశాల్లోనూ పుంజుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలోనే తొలి టీ20 నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించాలని మూడు రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. ఇంతకుముందు జరిగిన రెండు విదేశీ పర్యటనల్లోనూ పరాజయం పాలవడంతో ఈ సారి ఆ లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ కప్‌కు ముందు కీలకంగా భావిస్తున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో ఉన్న భారత్ జట్టు విజేతగా స్వదేశం చేరాలని భావిస్తోంది.

వారిద్దరూ ప్రతి బంతిని అంచనా వేయగలరని
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి .. పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలపై ప్రశంసలు కురిపించాడు. జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలోనూ అద్భుతంగా ఆడగలిగే సామర్థ్యం వారికుందని అన్నాడు. వారిద్దరూ అద్భుత ఆటగాళ్లని, ప్రతి బంతిని అంచనా వేయగలరని తెలిపాడు.

కేవలం ఆటపైనే దృష్టి పెడతా
జట్టును గెలిపించడానికి కోహ్లీ ఎంత వరకూ చేయగలడని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'జట్టును గెలిపించేందుకు ఏం చేయాలో దానిపై దృష్టి పెడతాను. జట్టు సభ్యులకి ఎలాంటి సాయమైనా చేస్తాను. ఇతర విషయాలను ఆలోచించను. కేవలం ఆటపైనే దృష్టి పెడతాను. ప్రస్తుతం భారత క్రికెట్ మరింత మెరుగ్గా తయారైంది. ఇదే తీరు చాలా కాలం పాటు కొనసాగేలా చూస్తాం.'

ఇంకా కొన్ని పారపాట్లు
జట్టులోని 11 మంది ఆటగాళ్లూ అద్భుతంగా ఆడుతున్నారు. గతంలో ఆడిన మ్యాచుల్లో చేసిన పొరబాట్లను తిరిగి చేయకుండా ఉండేందుకు టీమిండియా ప్రయత్నిస్తోంది. భారత జట్టు ఆటతీరు చాలా మెరుగుపడినప్పటికీ ఇంకా కొన్ని పారపాట్లు జరుగుతున్నాయి. అందుకే కొన్ని మ్యాచుల్లో మేము ఓడిపోతున్నాం.

మైదానంలోని పరిస్థితులను బట్టి స్పందిస్తాం:
మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన విషయంపై విరాట్ మాట్లాడుతూ.. ‘ఆటగాళ్లలో దురుసు ప్రవర్తన అనేది మైదానంలోని పరిస్థితులను బట్టి ఉంటుంది. టీమిండియా అటువంటి తీరు కనబర్చే జట్టు కాదు. కానీ, ప్రత్యర్థి జట్టు అటువంటి తీరు కనబర్చితే మనం కూడా అందుకు కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే విషయంలో టీమిండియా వెనుకాడదు' అని వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications