గంగూలీ, క్లైవ్ లాయిడ్‌ల రికార్డుతో కోహ్లి సమం
ఇక ఈ ఏడాది విదేశీ గడ్డపై టాస్ ఓడిపోవడం కోహ్లికి 8వ సారి. ఈ విషయంలో గంగూలీ, క్లైవ్ లాయిడ్‌ల రికార్డును కోహ్లి సమం చేశాడు. పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత్ సత్తా చాటుతుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఈ సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మ్యాచ్‌పై పట్టు చేజారిపోతున్న తరుణంలో పుజారా సెంచరీ
దీంతో సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అడిలైడ్ టెస్టులో తొలిరోజే మ్యాచ్‌పై పట్టు చేజారిపోతున్న తరుణంలో పుజారా సెంచరీతో రాణించడం, ఆ తర్వాత బౌలర్లు సమష్టిగా పోరాడటంతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ గడ్డపై ఓ టెస్టు సిరిస్‌లో టీమిండియా నెగ్గడం ఇదే మొదటిసారి. తొలి టెస్టు విజయ ఉత్సాహాంతోనే కోహ్లీసేన రెండో రెండో టెస్టులో బరిలోకి దిగుతోంది. పెర్త్‌లో నూతనంగా నిర్మించిన ఆప్టస్ స్టేడియంలో పిచ్.. పేస్, బౌన్స్‌కి సహకరిస్తుందని వార్తలు వస్తున్నాయి.

సొంతగడ్డపై ఆస్ట్రేలియా బలమైన జట్టు
ఈ విషయంపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "సొంతగడ్డపై ఆస్ట్రేలియా బలమైన జట్టు. దీనికి తోడు.. బౌలర్లకి అతిగా అనుకూలించే పెర్త్ వికెట్‌పై ఆడబోతుండటం కచ్చితంగా ఆ జట్టు పుంజుకునే అవకాశం ఉంది. దీనికి తోడు జీవమున్న పిచ్‌లను చూసి ఆందోళన చెందడం లేదు. పైగా ఆత్రుతగా ఉంటున్నాం. ప్రత్యర్థిని కకావికలం చేసే బౌలింగ్ దాడి మాకుంది. పెర్త్ పిచ్‌పై పచ్చిక తొలగించకున్నా మాకు సంతోషంగానే ఉంది. మేం సానుకూలంగా ఉండి ఒక బ్యాటింగ్ విభాగంగా సవాళ్లను స్వీకరించాలి. అడిలైడ్‌లో చేసిందే పునరావృతమయ్యేలా బౌలర్లను ఉత్సాహపరచాలి. అందుకే మేం ఆత్రుతగా ఉన్నాం" అని అన్నాడు.

ఆసీస్‌లో ఒక్క విజయంతో సంతృప్తి చెందం
"పదేళ్లుగా ఇలాంటి పిచ్‌లపై బాగానే ఆడా. నిజాయతీగా చెప్పాలంటే జోహన్స్‌బర్గ్ లాంటి వికెట్‌పై మాత్రం ఆడలేదు. 2012లో వాకాలో ఆడా. ఇలాంటి పిచ్‌లు మాకేం కొత్తకాదు. బౌన్సింగ్ పిచ్ కావడంతో టీమిండియాకి కూడా విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. ఆ ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగుతాం. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు అత్యుత్తమ పేస్‌బౌలింగ్ విభాగం ఉన్నందుకు గర్వపడుతున్నా. ఆ ఐదుగురు బౌలర్లు వారంతట వారే అన్నీ చేస్తారు. ఇక్కడ కూర్చొని ఆ ఘనతను నాకు ఆపాదించుకోను. 600, 700 ఇలా ఎన్ని పరుగులు చేసినా 20 వికెట్లు తీయనిదే టెస్టులు గెలవరు. 300 స్కోరే చేసినా 20 వికెట్లు తీస్తే అదే గొప్ప జట్టు. గత మూడు పర్యటనల్లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆసీస్‌లో ఒక్క విజయంతో సంతృప్తి చెందం" అని కోహ్లీ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications













