పెర్త్ టెస్టులో భారత్ గెలిస్తే రికార్డు: గంగూలీని కోహ్లీ సమం చేస్తాడా?

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. రెండో టెస్టులో పచ్చికతో కూడిన పిచ్‌ను సిద్ధం చేశారు. దీంతో పెర్త్ పిచ్ పేస్, బౌన్స్‌కు అతిగా సహకరిస్తుందనే వార్తలు వస్తున్నాయి.
ఈ సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో టెస్టులో కూడా టీమిండియా విజయం సాధిస్తే కెప్టెన్ కోహ్లీ అరుదైన రికార్డుని సాధిస్తాడు.
విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ
పెర్త్ టెస్టులో టీమిండియా గెలిస్తే విదేశాల్లో విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేస్తాడు. విదేశీ గడ్డపై గంగూలీ టీమిండియాకు ఆరు విజయాలను అందించాడు. కోహ్లీ ఇప్పటికే ఐదు విజయాలను నమోదు చేయగా, గంగూలీ రికార్డును అందుకోవడానికి ఇంకొక మ్యాచ్ గెలిచేస్తే సరిపోతుంది.

భారత జట్టు అరుదైన ఘనత
దీనికి తోడు పెర్త్ టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే భారత జట్టు అరుదైన ఘనత సాధిస్తుంది. 150 టెస్టు విజయాలు నమోదు చేసిన జట్ల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలుస్తుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 383 విజయాలతో ఆగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ 364తో రెండో స్థానం, విండీస్ 171తో మూడో స్థానం, దక్షిణాఫ్రికా 161 విజయాలతో నాలుగోస్థానంలో ఉంది.

శుక్రవారం నుంచి భారత్-ఆసీస్‌ల మధ్య రెండో టెస్టు
ఇదిలా ఉంటే, పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌లు దూరమయ్యారు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. రెండో టెస్టుకు గురువారం బీసీసీఐ 13 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌కు బదులు హనుమ విహారి, రవీంద్ర జడేజాలకు చోటు కల్పించింది.

పెర్త్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలం
మరోవైపు పెర్త్‌లో నూతనంగా నిర్మించిన ఆప్టస్ స్టేడియంలో పిచ్.. పేస్, బౌన్స్‌కి సహకరిస్తుందని వార్తలు వస్తోన్న తరుణంలో ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ రూపంలో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లని అదనంగా చేర్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications