Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన ఘనతకు ఒకే ఒక్క విజయం ముంగిట కోహ్లీసేన

హైదరాబాద్: ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మూడో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది.

భారత్‌కు ఇది వరుసగా తొమ్మిదో వన్డే విజయం. దీంతో వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టీమిండియాను గెలిపించిన మాజీ కెప్టెన్లు ధోనీ, రాహుల్ ద్రవిడ్‌ల సరసన కోహ్లీ చేరాడు. ధోని సారథ్యంలోని టీమిండియా నవంబరు 14, 2008 నుంచి ఫిబ్రవరి 5, 2009 వరకు వరుసగా 9 వన్డేల్లో విజయం సాధించింది.

2006లో జట్టుకు సారథిగా ఉన్న రాహుల్ ద్రవిడ్ కూడా వరుసగా 9 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. ఇక ఇప్పుడు కోహ్లీ కెప్టెన్సీలోని జట్టు కూడా ఆ ఘనత సాధించింది. జూలై 6, 2017 నుంచి సెప్టెంబరు 24, 2017 వరకు వరుసగా 9 వన్డేల్లో విజయం సాధించింది. వరుస విజయాల విషయంలో తొమ్మిదో విజయమే భారత్‌కు ఇప్పటి వరకు అత్యధికం కావడం విశేషం.

అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో కొన్ని దేశాలు వన్డేల్లో పది అంతకంటే ఎక్కువ విజయాలు వరసగా సాధించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. టీమిండియా మాత్రం ఎప్పుడూ వరసగా పది విజయాలను నమోదు చేయలేదు. వన్డే సీరిస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగే నాలుగో వన్డేలో విజయం సాధిస్తే భారత్ వరుసగా పది విజయాల సాధించిన దేశాల జాబితాలోకి చేరుతుంది.

అగ్రస్ధానంలో ఆస్ట్రేలియా

అగ్రస్ధానంలో ఆస్ట్రేలియా

వరుస విజయాల విషయంలో ఆస్ట్రేలియా ఎవ్వరూ అందుకోలేని రికార్డును నమోదు చేసింది. గతంలో ఆస్ట్రేలియా వరసగా 21వ వన్డేల్లో విజయం సాధించింది. రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఈ ఘనత సాధించింది. 2003 జనవరి లో మొదలుపెట్టిన విజయ ప్రస్థానం ఆ ఏడాది మే నెలాఖరు వరకూ కొనసాగింది. ఆసీస్ సాధించిన ఈ 21 వరస విజయాల్లో 2003 వరల్డ్ కప్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఆ ఏడాది వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ఒక్క ఓటమి లేకుండా ట్రోఫీని నెగ్గింది.

పాకిస్థాన్ కూడా

పాకిస్థాన్ కూడా

ఆసీస్ తర్వాత 12 వన్డేల్లో వరుస విజయాలు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా ఉంది. 2005లో దక్షిణాఫ్రికా ఈ ఘనత సాధించింది. ఇక పాకిస్థాన్ కూడా వరుసగా 12 వన్డేల్లో విజయం సాధించిన చరిత్ర ఉంది. 2008లో జింబాబ్వేతో వరసగా ఐదు వన్డేలను, బంగ్లాదేశ్‌తో వరసగా ఆరు వన్డేలను పాక్ నెగ్గింది. టీమిండియాపై ఒక మ్యాచ్‌లో విజయంతో పాకిస్థాన్ వరుసగా 12 విజయాలను నమోదు చేసింది.

వరుసగా 12 మ్యాచ్‌లను నెగ్గిన దక్షిణాఫ్రికా

వరుసగా 12 మ్యాచ్‌లను నెగ్గిన దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా జట్టు ఇటీవల కూడా మరోసారి వరుసగా 12 మ్యాచ్‌లను నెగ్గింది. వరుస విజయాల రికార్డులను పరిశీలిస్తే ఆస్ట్రేలియా పలు సార్లు వరసగా 10 విజయాలను సాధించింది. పాకిస్థాన్, విండీస్, దక్షిణాఫ్రికా జట్లకు కూడా ఇలాంటి విజయపరంపరను సాధించాయి. న్యూజిలాండ్, శ్రీలంక కూడా ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

భారత్ పది విజయాలను సాధించిన సందర్భం లేదు

భారత్ పది విజయాలను సాధించిన సందర్భం లేదు

అయితే ఒక్క టీమిండియా మాత్రమే చరిత్రలో ఇంత వరకూ వరసగా పది విజయాలను సాధించిన సందర్భం లేదు. టీమిండియా అత్యధిక విజయాల సంఖ్య 9 మాత్రమే.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+