పేక మేడలా కుప్పకూలిన భారత టాపార్డర్: 3 పరుగులకే కోహ్లీ ఔట్ (వీడియో)

సిడ్నీ: ఆసీస్‌తో ఢీకొంటున్న భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో కంగారూ బౌలర్ల ధాటికి భారత వికెట్లు రాలిపోతున్నాయి. ఆసీస్ గడ్డపై రాణించాలన్న ఒత్తిడి, ప్రత్యర్థి బౌలర్లను సరిగ్గా అంచనావేయలేకపోవడం టీమిండియాకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో లంచ్ విరామానికి ముందే 4వికెట్లు కోల్పోయిన భారత్, ప్రస్తుతం ఐదు వికెట్ల నష్టంతో నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన విరాట్(3) సైతం నిరాశతోనే వెనుదిరిగాడు.

ఓపెనర్లు హాంఫట్
హేజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్(2; 8బంతుల్లో) స్లిప్‌లో ఫించ్ చేతికి చిక్కాడు. అనంతరం స్టార్క్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ మురళీ విజయ్(11; 22బంతుల్లో 1ఫోర్‌తో వికెట్‌కీపర్ ఫైన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అడిలైడ్ వేదికగా గురువారం ఉదయం 5:30నిమిషాలకు ఆరంభమైంది. తొలి టెస్టు ఆరంభంలోనే భారత్ ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. దీంతో 8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 17పరుగులు చేసింది.

3 పరుగులకే ఔటైన కోహ్లీ
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బలహీనత మరోసారి వెంటాడింది. తొలి టెస్టు మ్యాచ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లి పేలవరీతిలో 3 పరుగులకే ఔటైపోయాడు. భారీ అంచనాల మధ్య క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ అభిమానుల్ని నిరాశపరిచాడు. ముందస్తు వ్యూహం ప్రకారం.. తొలుత వరుస బౌన్సర్లతో కోహ్లీని వెనక్కి తగ్గేలా చేసిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు.. ఆ తర్వాత ఊరిస్తూ ఆఫ్ స్టంప్ వెలుపల బంతులు వేశారు.
గల్లీలో ఉస్మాన్ ఖవాజా చేతికి
కవర్స్ దిశగా బంతిని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించిన విరాట్ కోహ్లీ.. గల్లీలో ఉస్మాన్ ఖవాజా చేతికి చిక్కాడు. క్షణాల వ్యవధిలో దూసుకొచ్చిన బంతిని ఒంటిచేత్తో అద్భుతంగా ఖవాజా అందుకున్నాడు. కెరీర్ ఆరంభంలో ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతుల్ని వెంటాడటం కోహ్లీ బలహీనతగా ఉండేది. అయితే.. మూడేళ్లుగా ఆ బలహీనతని అధిగమించిన కోహ్లీ మైదానంలో పరుగులు వరద పారించాడు. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపైనా అదే జోరుని కొనసాగిస్తాడని భారత్ ఆశించింది.

లంచ్‌కు ముందు 4 మొత్తంగా 5
కోహ్లీపైనే ఆశలు పెట్టుకున్న భారత్ జట్టులో గుబులు మొదలైంది. భోజన విరామ సమయానికి భారత్ 27 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత లైన్ వేసిన 37.3వ బంతికి రోహిత్ (37: 61) మార్కస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 86 పరుగులకే భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది.
ప్రస్తుతం భారత్ 40 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. పుజారా (23), పంత్ (2) క్రీజులో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications