న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ గడ్డపై కోహ్లీ మరో 2 చేస్తే సచిన్‌ను దాటేయొచ్చు!!

India vs Australia 2018 : Virat Kohli Could Break Sachin Tendulkar's Record | Oneindia Telugu
India vs Australia: Virat Kohli could break Sachin Tendulkars record

సిడ్నీ: ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్‌లో విజయం సాధించడం టీమిండియా ఎన్నో ఏళ్ల కల. అదే గడ్డపై ఆసీస్ ను ఓడించడం అంత తేలికైన విషయం కాదు. అయితే ప్రస్తుత భారత జట్టు పటిష్ఠంగా కనిపిస్తుండటం.. ఫామ్ లేమితో ఆసీస్ టెస్టు జట్టు సతమతమవుతుండటం.. ఈ సారి జట్టు విజయానికి కారణాలుగా మారనున్నాయి. ఈ మేరకు కెప్టెన్ కోహ్లీ నేతృత్వంలో నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది టీమిండియా.

అన్ని విభాగాల్లో బలంగా ఉన్న టీమిండియా

అన్ని విభాగాల్లో బలంగా ఉన్న టీమిండియా

నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు అడిలైడ్‌లోని ఓవల్ మైదానంలో డిసెంబర్ 6న ఆరంభంకానుంది. ఈ క్రమంలో అన్ని విభాగాల్లో బలంగా ఉన్న టీమిండియా ఈసారి ఎలాగైనా సిరీస్ నెగ్గాలని పట్టుదలతో ఉంది. భారత జట్టు విజయంతో పాటు గతంలో ఆసీస్‌లో పర్యటించిన విరాట్‌ సైతం ఇక్కడ మంచి రికార్డు సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.

 విరాట్ ఇప్పటి వరకు 5 టెస్టు సెంచరీలు

విరాట్ ఇప్పటి వరకు 5 టెస్టు సెంచరీలు

ఆసీస్‌తో ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ ఇప్పటి వరకు 5 టెస్టు సెంచరీలు నమోదు చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసేందుకు కోహ్లీ ఇంకో రెండు సెంచరీలు చేయాల్సి ఉంది. ఆరు సెంచరీలతో ఆసీస్ వేదికగా అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా సచిన్ నం.1 స్థానంలో ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లలో విజృంభించి ఆడి పరుగుల వరద పారించిన ఇన్నింగ్స్‌లు మరపురానివి.

విరాట్ విశేషంగా రాణిస్తే సచిన్ రికార్డును

విరాట్ విశేషంగా రాణిస్తే సచిన్ రికార్డును

20 టెస్టుల్లో 53.20 సగటుతో 1809 పరుగులు చేశాడు. రన్‌మెషీన్ కోహ్లీకి గొప్ప రికార్డే ఉంది. ఈ నేపథ్యంలో సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ విశేషంగా రాణిస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేయగలడు. ఆస్ట్రేలియాలో ఆసీస్‌తో 8 టెస్టులాడిన విరాట్ 62 సగటుతో 992 పరుగులు చేశాడు. ఆసీస్ పర్యటనలో సునీల్ గవాస్కర్ 5, వీవీఎస్ లక్ష్మణ్ 4, అమర్‌నాథ్ 2 శతకాలు నమోదు చేశారు.

కోహ్లీయే మా టార్గెట్

కోహ్లీయే మా టార్గెట్

'మరో వైపు ఆసీస్ బౌలర్లు విరాట్ కోహ్లీయే మా టార్గెట్. అతణ్ని అవుట్ చేసి టీమిండియా పరుగులు కట్టడి చేస్తాం' అనే బలమైన నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. బ్యాట్స్‌మెన్‌లో నైపుణ్య లోపం కనిపిస్తుంది. కానీ, ఆసీస్ బౌలర్లు కూడా సొంత గడ్డపై రాణించాలని తమ బౌలింగ్‌కు పదునుపెడుతున్నారు.

Story first published: Thursday, November 29, 2018, 14:37 [IST]
Other articles published on Nov 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X