భారత్ vs ఆసీస్: ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు నెం.1 ర్యాంక్ టీమిండియాదే!


హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 6న ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఆసీస్ గడ్డపై కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్‌ని డ్రాగా ముగిస్తే చాలు.. ప్రస్తుతం టెస్టుల్లో ఉన్న నంబర్ వన్ ర్యాంక్‌కి ఎలాంటి ఢోకా ఉండదని ఐసీసీ పేర్కొంది.
ఈ మేరకు ఐసీసీ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. గురువారం నుంచి అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం టెస్టు ర్యాంకులను ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు సిరీస్ ఫలితంతో ర్యాంక్‌ల్లో మార్పులు ఎలా ఉండబోతాయో కూడా వెల్లడించింది.

ప్రస్తుతం 116 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు ప్రస్తుతం 116 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 102 పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు ఐదో స్థానంలో ఉంది. గురువారం నుంచి జరగనున్న నాలుగు టెస్టు సిరీస్‌లో ఒకవేళ ఆస్ట్రేలియా 4-0తో విజయం సాధిస్తే? అప్పుడు ఆస్ట్రేలియా 110 పాయింట్లకి చేరుకోగా.. భారత్ 108 పాయింట్లకి పడిపోతుంది.

4-0తో గెలిస్తే భారత్ ఖాతాలో 120 పాయింట్లు
అదే టీమిండియా టెస్టు సిరిస్‌ను 4-0తో గెలిస్తే భారత్ ఖాతాలో 120 పాయింట్లు వచ్చి చేరుతాయి. మరోవైపు ఆసీస్ 97 పాయింట్లకి దిగజారుతుంది. అలా కాకుండా ఆస్ట్రేలియా సిరీస్‌ని 3-0తో గెలిస్తే, అప్పుడు భారత్ 109, ఆస్ట్రేలియా 108 పాయింట్లతో నిలుస్తుంది. దీంతో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది.

2014-15లో చివరిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై
2014-15లో చివరిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 0-2తో చేజార్చుకుంది. ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలతో చెలరేగడంతో పాటు 692 పరుగులు చేశాడు. అయితే, జట్టు సభ్యుల నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో ఒక్క మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలవలేకపోయింది.

ఆసీస్ గడ్డపై ఇప్పటివరకు టెస్టు సిరిస్‌ను గెలవని భారత్
గత నలభై ఏళ్లుగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నా... టీమిండియా ఇప్పటివరకు టెస్టు సిరిస్‌ను గెలవలేదు. ఈ నేపథ్యంలో ఆసీస్ గడ్డపై అందని ద్రాక్షగా మిగిలిపోయిన టెస్టు సిరీస్‌ని ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో కోహ్లీసేన ఉంది. దీనికి తోడు ఆసీస్ స్టార్ ప్లేయర్లు స్మిత్, వార్నర్ లేకపోవడంతో ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications