రెండో టీ20లో భారత్ ఓటమి: సిక్సులతో సహా కోహ్లీ నమోదు చేసిన రికార్డులివే


హైదరాబాద్: రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 38 బంతుల్లోనే 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన కోహ్లి మ్యాచ్‌ను తనదైన శైలిలో ముగించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అనంతం ఆసీస్ ఆటగాడు మ్యాక్స్ వెల్(113 నాటౌట్) సెంచరీతో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన కోహ్లీ మొత్తంగా ఆరు సిక్స్‌లు బాదాడు. దీంతో కోహ్లీ ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులను నెలకొల్పాడు.

టీ20 మ్యాచ్‌లో కోహ్లికి ఇవే అత్యధిక సిక్స్‌లు
ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో కోహ్లికి ఇవే అత్యధిక సిక్స్‌లు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో 189.47 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసిన కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లో 50 సగటును అందుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా కోహ్లీ (104) నిలిచాడు. ఈ క్రమంలో డివిలియర్స్ (102)ను దాటేశాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ (150) ఉన్నాడు.

చిన్నస్వామి స్టేడియంలో ఎక్కువ సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా కోహ్లీ
అంతేకాదు ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఆడే కోహ్లి.. ఈ మ్యాచ్‌తో చిన్నస్వామి స్టేడియంలో టీ20ల్లో 2500 పరుగులు కూడా పూర్తి చేశాడు. దీంతో పాటు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ (20) సరసన కోహ్లీ నిలిచాడు. టీ20ల్లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో దిల్షాన్(223)తో కలిసి కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.

భారత్ తరఫున టీ20ల్లో 50కి పైగా సిక్స్‌లు
భారత్ తరఫున టీ20ల్లో 50కి పైగా సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు స్వదేశంలో ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం. స్వదేశంలో కోహ్లి కెప్టెన్సీలో భారత్ మూడు ఫార్మాట్‌లలో కలిపి 16 సిరీస్‌లు ఆడింది. 14 సిరీస్‌లలో గెలిచింది. మరో సిరీస్‌ను ‘డ్రా' చేసుకొని తాజా టి20 సిరీస్‌లో ఓడింది.

కోహ్లీ సిరీస్ ఓడటం ఇదే తొలిసారి
ధోని నుంచి పగ్గాలందుకున్నాక సొంతగడ్డపై ఏ ఫార్మాట్లో అయినా కోహ్లీ సిరీస్ ఓడటం ఇదే తొలిసారి. 2014 నుంచి ఇప్పటిదాకా స్వదేశంలో అతను 7 టెస్టు, ఐదు వన్డే, రెండు టీ20 సిరీస్‌లు గెలిచాడు. ఒక సిరీస్ డ్రా అయింది. వరుసగా రెండు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లను ఓడిపోవడం భారత్‌కిదే తొలిసారి. ఈ సిరీస్‌కంటే ముందు న్యూజిలాండ్‌లోనూ భారత్‌కు ఓటమి ఎదురైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications