For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీమిండియాను కట్టడి చేస్తాం.. స్మిత్, వార్నర్ లేకపోయినా పర్లేదు'

India vs Australia: Virat Kohli and boys served fresh warning by Australian wicket-keeper ahead of Test series

మెల్‌బోర్న్‌: టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరే ముందు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు లేకపోవడంతో ఆసీస్ జట్టు బలహీనంగా ఉందని చాలా మంది క్రీడా విశ్లేషకులు చెప్పుకొచ్చారు. అంతేకాదు, టీమిండియాకి ఇదే సరైన సమయం ఇలాంటప్పుడే ఆసీస్‌ను సొంతగడ్డపై ఓడించేందుకు అనువైన సమయమంటూ సూచనలు చేశారు. కానీ, టీ20 సిరీస్‌లో భాగంగా మొదలైన తొలి టీ20లో టీమిండియాను క్లిష్టమైన పరిస్థితుల్లోకి నెట్టి నాలుగు పరుగుల తేడాతో గెలవడంతో అంచనాలు తారుమారైనట్లు కనిపిస్తోంది.

స్మిత్, వార్నర్ లేకపోయినా

స్మిత్, వార్నర్ లేకపోయినా

దీంతో ఆసీస్ ఎప్పుడూ బలహీనపడదంటూ ఆ దేశ క్రికెటర్లు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో కీలక ఆటగాళ్లైన స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ అందుబాటులో లేకున్నా ఆసీస్‌ ఎప్పటికీ బలమైన ప్రత్యర్థేనని ఆ జట్టు వికెట్‌కీపర్‌ పీటర్‌ నేవిల్‌ అన్నాడు. బాల్‌టాంపరింగ్‌ కారణంగా స్మిత్‌, వార్నర్‌ జట్టుకు దూరం కావడంతో ఇటీవల ముగిసిన అన్ని పర్యటనల్లోనూ ఆస్ట్రేలియా వరుస ఓటములతో సతమతమవుతోంది.

బ్యాటింగ్ పరంగా ఆసీస్‌ బలహీనంగా

బ్యాటింగ్ పరంగా ఆసీస్‌ బలహీనంగా

ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి తొలిసారిగా టెస్టు సిరీస్‌ కైవసం చేసుకునే అవకాశం కోహ్లీసేనకు వచ్చిందని పలువురు క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే బ్యాటింగ్ పరంగా ఆసీస్‌ బలహీనంగా కనిపిస్తున్నా.. ఈ టెస్టు సిరీస్‌లో బౌలర్ల నుంచి కోహ్లీసేనకు ప్రతిఘటన తప్పదని పీటర్‌ నేవిల్‌ పేర్కొన్నాడు.

రివర్స్‌ స్వింగ్‌ రాబడుతూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి

రివర్స్‌ స్వింగ్‌ రాబడుతూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి

‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా బౌలింగ్‌ దళం పటిష్టంగా ఉంది. ముఖ్యంగా పేస్‌బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌ ఒక్కసారి లయ అందుకుంటే చాలు టెస్టు సిరీస్‌లో వారితో భారత బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం వాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. రివర్స్‌ స్వింగ్‌ రాబడుతూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలరు. ఒకవేళ వాళ్లు అదే జోరు కొనసాగిస్తే ఈ టెస్టు సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ కఠిన సవాళ్లు ఎదుర్కోక తప్పదు.' అని ఈ వికెట్‌కీపర్‌ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ.. రోహిత్‌లను కట్టడి చేస్తూ:

కోహ్లీ.. రోహిత్‌లను కట్టడి చేస్తూ:

మరోవైపు ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియన్‌తోనూ కోహ్లీసేన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ 33ఏళ్ల వికెట్‌కీపర్‌ తెలిపాడు. ఆసీస్ గడ్డపై తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 4పరుగులకే అవుట్ అయి పెవిలియన్ చేరుకున్నాడు. కోహ్లీతో పాటుగా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను సైతం ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా భావించిన ఆసీస్ జట్టు కేవలం 7పరుగులకే అవుట్ చేసింది. టీ20ల్లో రెచ్చిపోయి ఆడే రోహిత్‌ను చక్కగా కట్టడి చేయగలిగింది. ఇక రెండో టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో నిర్ణయాత్మకమైన మూడో టీ20 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనుంది.

Story first published: Sunday, November 25, 2018, 10:31 [IST]
Other articles published on Nov 25, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+