India Vs Australia: టీ20ల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు


హైదరాబాద్: విశాఖ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.

24 పరుగులు చేసిన కోహ్లీ
ఇందులో విరాట్ కోహ్లీ 24 పరుగులు చేశాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఒక జట్టుపై 500కు పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు 15 టీ20లాడిన కోహ్లీ 56.88 యావరేజితో 512 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 క్రికెట్ చరిత్రలో ఓ జట్టుపై ఏ బ్యాట్స్‌మన్ కూడా 500కుపైగా పరుగులు చేయలేదు. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (463) పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన టీ20ల్లో మార్టిన్ గుప్టిల్ ఈ పరుగులు చేశాడు. విశాఖ టీ20తో తొలిసారి ఈ అరుదైన ఘనతను కోహ్లీ సాధించాడు.

తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లో
కాగా విశాఖలో తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లో కనీసం హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ(118, 117, 99, 65, 167, 81, 158 నాటౌట్) తొలిసారి ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 24 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించగా... మిగతా అందరు బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు.

చివరి రెండు ఓవర్లలో ఏడు డాట్ బాల్స్ ఆడిన ధోని
మరోవైపు చివరి రెండు ఓవర్లలో ఏడు డాట్ బాల్స్ ఆడిన ధోని.. 37 బంతుల్లో 29 పరుగులు చేసి విమర్శల పాలయ్యాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. దీంతో ఆసీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య బుధవారం బెంగళూరు వేదికగా రెండో టీ20 జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications