న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిస్క్‌ చేస్తానని కోహ్లీకి చెప్పా.. సెంచరీ సాధించా: రోహిత్

IND VS AUS 2020 : Rohit Sharma Says 'Kohli & I Knew We Had To Get A Big Partnership' || Oneindia
India vs Australia: Virat Kohli and I knew we had to get a big partnership says Rohit Sharma

బెంగళూరు: ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్‌ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ (119, 128 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించగా.. విరాట్‌ కోహ్లీ(89; 91 బంతుల్లో 8x4) అద్భుతంగా ఆడాడు. ఈ జోడి రెండో వికెట్‌కు విలువైన 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

కెప్టెన్‌కు మించిన బ్యాట్స్‌మన్‌ లేడు

కెప్టెన్‌కు మించిన బ్యాట్స్‌మన్‌ లేడు

సెంచరీ చేసిన రోహిత్‌ శర్మ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో రోహిత్‌ మాట్లాడుతూ... 'సిరీస్ డిసైడర్ మ్యాచ్‌ కావడంతో ఆస్ట్రేలియాను 290లోపు కట్టడి చేశాం. దీంతో మా ప్రణాళిక సక్సెస్‌ అయ్యింది. లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్‌ను నిర్మించడానికి యత్నించా. రాహుల్‌ ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ, నేను కలిసి భారీ భాగస్వామ్యం సాధించాలని అనుకున్నాం. అందుకు కెప్టెన్‌కు మించిన బ్యాట్స్‌మన్‌ లేడు' అని తెలిపాడు.

రిస్క్‌ చేస్తానని కోహ్లీకి చెప్పా

రిస్క్‌ చేస్తానని కోహ్లీకి చెప్పా

'కోహ్లీ, నేను బాధ్యతాయుతంగా ఆడాం. టీమిండియా వ్యూహంలో ఆ భాగస్వామ్యం ఎంతో కీలకం. ఇద్దరిలో ఒకరు నెమ్మదిగా ఆడుతూ మరొకరు ధాటిగా ఆడాలని మధ్యలో నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే 100 పరుగుల భాగస్వామ్యం నిర్మించాం. అనంతరం నా సహజ శైలిలో ఆడుతూ రిస్క్‌ చేస్తానని కోహ్లీకి చెప్పా, ఆపై సెంచరీ సాధించా. ఆసీస్‌ టాప్‌-3 బౌలర్ల నుంచి మాకు తీవ్ర తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేసారు. అయినా 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాం' అని రోహిత్ అన్నాడు.

వికెట్లు కోల్పోయింటే పరిస్థితి మరోలా ఉండేది

వికెట్లు కోల్పోయింటే పరిస్థితి మరోలా ఉండేది

'ఒకవేళ టీమిండియా వికెట్లు కోల్పోయింటే పరిస్థితి మరోలా ఉండేది. కీలక మ్యాచ్‌ల్లో ఆసీస్‌ బౌలర్లు సవాలు విసురుతారని ముందే అనుకున్నాం. అందుకు సిద్దపడే క్రీజులోకి వచ్చా. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడాలనుకున్నది ఈ మ్యాచ్‌లో ఆడా. ఈ రోజు 35 ఓవర్ల వరకు క్రీజులో ఉండాలనుకున్నా. అలానే ఉన్నా' అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

రోహిత్ @ 9,000

రోహిత్ @ 9,000

మూడో వన్డే ద్వారా రోహిత్‌ శర్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 9,000 పరుగులు పూర్తిచేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ (217) రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు కోహ్లీ (194), ఏబీ డివిలియర్స్‌ (208) తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్‌ ఈ మార్క్‌ అందుకున్నాడు. రోహిత్‌ తర్వాత గంగూలీ (228), సచిన్‌ టెండూల్కర్‌ (235), బ్రియాన్ లారా (239)లు ఉన్నారు.

Story first published: Monday, January 20, 2020, 11:40 [IST]
Other articles published on Jan 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X