For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీలో 5th ODI: ఖవాజా సెంచరీ, డివిలియర్స్ రికార్డు బద్దలు

India vs Australia: Usman Khawaja in Kohli, de Villiers league after Delhi ODI hundred

హైదరాబాద్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఆరోన్ ఫించ్(27), ఉస్మాన్ ఖవాజా(100) చక్కటి శుభారంభం అందించారు.

వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించిన తర్వాత రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌ మూడో బంతికి ఫించ్(27) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి దిగిన హాండ్స్‌కోంబ్‌తో కలిసి ఖవాజ నిలకడగా ఆడుతూ వన్డేల్లో 102 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో రెండో సెంచరీని నమోదు చేశాడు.

ఈ సిరిస్‌లో ఖవాజాకు ఇది రెండో సెంచరీ కాగా, వన్డేల్లో కూడా రెండోది కావడం విశేషం. కెరీర్‌లో చేసిన ఈ రెండు శతకాలు భారత్‌పైనే సాధించడం గమనార్హం. రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో 107 బంతుల్లో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కుల్దీప్‌ వేసిన 31.5వ బంతికి సింగిల్‌ తీసి ఈ ఘనత అందుకున్నాడు.

1
45589

మొత్తంగా ఈ సిరీస్‌లో 383 పరుగులు చేశాడు. దీంతో భారత్‌పై భారత్‌లో ఐదు వన్డేల సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాప్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(358) పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టాడు. సెంచరీ అనంతరం భువనేశ్వర్ బౌలింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆసీస్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ (1) కూడా కోహ్లీకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇన్నింగ్స్‌ 33వ ఓవర్‌లో ఖవాజాని భువనేశ్వర్ ఔట్ చేయగా.. తర్వాత ఓవర్‌లో మాక్స్‌వెల్‌ని జడేజా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత పీటర్ హ్యాండ్స్ కోంబ్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.

షమీ బౌలింగ్‌లో హ్యాండ్స్ కోంబ్(52; 60 బంతుల్లో 4 ఫోర్లు) వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 40 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. క్రీజులో టర్నర్ (13), మార్కస్ స్టోయినిస్ (8) పరుగులతో ఉన్నారు.

Most runs in a 5-match ODI series vs India in India:
383 runs* - USMAN KHAWAJA, This series
358 runs - AB de Villiers, 2015
353 runs - Gordon Greenidge, 1983
353 runs - Tillakaratne Dilshan, 2009

Story first published: Wednesday, March 13, 2019, 16:54 [IST]
Other articles published on Mar 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+