For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్‌లో రెండో టెస్టు: తన స్పిన్‌తో భారత్‌కు బ్రేక్ ఇచ్చిన అంధ్ర కుర్రాడు

 India vs Australia: Trump card Hanuma Vihari impresses on Day 1 as Virat Kohlis men bounce back in Perth

హైదరాబాద్: పెర్త్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టు ఆటలో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ మార్కస్ హారిస్(70), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్(58), ఆరోన్ ఫించ్(50) హాఫ్ సెంచరీలతో రాణించి ఆస్ట్రేలియా పటిష్ట 277/6 స్థితిలో నిలిపారు.

అయితే, తొలి సెషన్‌లో వికెట్ కోల్పోని ఆస్ట్రేలియా ఆ తర్వాతి రెండు సెషన్లలో మూడు వికెట్లు చొప్పున ఆరు వికెట్లను కోల్పోవడం విశేషం. ముఖ్యంగా లంచ్ విరామం అనంతరం పర్యాటక బౌలర్లు చెలరేగారు. భారత పేసర్లు లైన్ అండ్ లెంత్ బంతులతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టడంతో పాటు స్వల్ప విరామాల్లో వికెట్లు పడగొట్టారు.

బుమ్రాతో పాటు మెరిసిన హనుమ విహారి

బుమ్రాతో పాటు మెరిసిన హనుమ విహారి

తొలి రోజు ఆటలో భారత బౌలర్లలో బుమ్రాతో పాటు ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి తన స్పిన్ మ్యాజిక్‌తో అందరినీ ఆశ్చర్యపరచాడు. తన కెరీర్‌లో రెండో టెస్ట్ ఆడుతున్న హనుమ విహారి భారత జట్టులో ప్రధాన స్పిన్నర్ లేని లోటుని తీర్చాడు. కీలక సమయంలో ముఖ్యమైన వికెట్లను తీసి ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు.

 రెండు కీలక వికెట్లు తీసిన విహారి

రెండు కీలక వికెట్లు తీసిన విహారి

తొలిరోజు భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ(2/35), స్పిన్నర్ హనుమ విహారి (2/53) చెరో రెండు వికెట్లు తీయగా.... బుమ్రా(1/41), యాదవ్(1/68) చెరో వికెట్ తీసుకున్నారు. క్రీజులో పాతుకుపోయిన భారత పేసర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఆసీస్ ఓపెనర్ మార్కస్ హ్యారిస్‌ను బోల్తా కొట్టించిన తీరు నిజంగా అద్భుతం.

అద్భుతమన క్యాచ్‌ పట్టిన రహానే

అద్భుతమన క్యాచ్‌ పట్టిన రహానే

ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి క్రీజులో పాతుకుని భారీ స్కోరు దిశగా సాగుతున్న ఓపెనర్ మార్కస్ హ్యారిస్‌(70)ను హనుమ విహారి పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ 49 ఓవర్లో హనుమ విహారి వేసిన రెండో బంతిని అమాంతం గాల్లోకి లేపడంతో అక్కడే ఉన్న రహానే దానిని చక్కటి క్యాచ్‌గా అందుకున్నాడు.

గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో తుది జట్టులోకి

గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో తుది జట్టులోకి

అడిలైడ్ టెస్టులో రోహిత్ శర్మ గాయపడటంతో.. అతని స్థానంలో హనుమ విహారి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. పెర్త్ పిచ్ ఎక్కువగా పేస్, బౌన్స్‌కి అనుకూలిస్తుండటంతో.. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలనుకున్న టీమిండియా.. ఒక స్పిన్ ఆల్‌రౌండర్‌‌ని కూడా టీమ్‌లో చేర్చాలనుకుంది.

కీలక సమయంలో భారత్‌కు మరో బ్రేక్

కీలక సమయంలో భారత్‌కు మరో బ్రేక్

ఈ క్రమంలో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నుంచి పోటీ ఏర్పడినా.. హనుమ విహారీపై నమ్మకంతో కోహ్లీ తుది జట్టులో చోటిచ్చాడు. అయితే, కోహ్లీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తొలిరోజు రెండు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత ట్రావిస్‌ హెడ్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేయత్నం చేసిన షాన్ మార్ష్(45)ను కీలక సమయంలో ఔట్ చేసి భారత్‌కు మరో బ్రేక్ ఇచ్చాడు.

1
43624
Story first published: Friday, December 14, 2018, 18:05 [IST]
Other articles published on Dec 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+