కోహ్లీసేనను రెచ్చగొడితే మనకి చిక్కులు తప్పవ్: ఆసీస్ కెప్టెన్

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఆసీస్ ఆటగాళ్ల కవ్వింపు చర్యలపై పెద్ద చర్చ మొదలైంది. కోహ్లీ పర్యటనకు ముందే మేము శాంతంగానే ఉంటాం. వాళ్ల నుంచి అభ్యంతరకరంగా ఏమైనా వస్తే మాత్రం ఊరుకునేది లేదని బదులిచ్చాడు. గతంలో 2014 పర్యటనలో కోహ్లీతో ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ పెద్ద ఎత్తున కవ్వింపులకి దిగాడు.

గాయపరిచేందుకు కూడా వెనుకాడలేదు
ఒకానొక దశలో.. కోహ్లీని గాయపరిచేందుకు కూడా అతను వెనుకాడలేదు. అయితే.. ఆ ఆధిపత్య పోరుని సవాల్‌గా తీసుకున్న విరాట్ కోహ్లి నాలుగు సెంచరీలు బాదేసి ఏకంగా 694 పరుగులు చేశాడు. కానీ, ప్రస్తుత పర్యటనలో అలాంటి వాటికి తావివ్వకూడదని.. భారత్‌తో టెస్టు సందర్భంగా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని తమ ఫాస్ట్ బౌలర్లకు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ సూచించాడు.

బాల్ టాంపరింగ్ ప్రభావం లేదన్నాడు
అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ఎప్పటిలాగే దూకుడుగానే ఆడుతుందన్నాడు. కానీ, తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉందని అన్నాడు. ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాలో జరిగిన బాల్ టాంపరింగ్ ప్రభావం జట్టుపై ఎంతమాత్రం లేదన్నాడు. ఆ ఘటన నుంచి తమను తాము మంచిగా చూపించుకోవడానికే సౌమ్యంగా ఆడుతోందన్న పలువురి మాజీ ఆటగాళ్ల విమర్శలను తిప్పికొట్టేలా వ్యాఖ్యలు చేశాడు.

ప్రత్యర్థులపై దూకుడుగానే ఆడుతున్నారని
ఆస్ట్రేలియా ఆటగాళ్లు సహజ శైలిని పక్కనబెట్టి ప్రత్యర్థులపై దూకుడుగానే ఆడుతున్నారని మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ విమర్శించిన విషయం తెలిసిందే. తమలో దూకుడు తగ్గలేదని, అయితే ప్రత్యర్థి ఆటగాళ్లను కూడా గౌరవిస్తామని క్లార్క్ మాటలకు అనుగుణంగా పైనె బదులిచ్చాడు.

భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని
భారత ఆటగాళ్లపై కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జాస్ హేజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్‌లను పైన్ కోరాడు. అలా చేస్తే తమ జట్టుకే నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నాడు. బౌలర్ల లయ దెబ్బతిని మూల్యం చెల్లించుకునే అవకాశం ఉందని సూచించాడు. బౌలర్లు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే టీమిండియాను అడ్డుకోవడం కష్టమేమీ కాదని అన్నాడు. అంతేకానీ, కవ్వింపులకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications