
అడిలైడ్ టెస్టులో ఆడిన జట్టుతోనే
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ సైతం అడిలైడ్ టెస్టులో ఆడిన జట్టుతోనే రెండో టెస్టులో బరిలోకి దిగాలని సూచించిన సంగతి తెలిసిందే. అయితే, రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అడిలైడ్ టెస్టులో ఓపెనర్ ఆరోన్ ఫించ్ 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

ఆరోన్ ఫించ్‌పై తీవ్ర విమర్శలు
దీంతో అతడిపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఓపెనర్లుగా ఉస్మాన్ ఖావాజా, షాన్ మార్ష్‌లు బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో ఆరోన్ ఫించ్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. పెర్త్ టెస్టుని ఆతిథ్య జట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ వెల్లడించాడు.

టిమ్ పైన్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా టిమ్ పైన్ మాట్లాడుతూ "టెస్టు సిరిస్‌ను సమం చేయడానికి భారీ పరుగులు చేయాలి. ఇదే జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది" అని రిపోర్టర్లతో టిమ్ పైన్ వ్యాఖ్యానించాడు. మరోవైపు పెర్త్ పిచ్ బౌన్స్, పేస్‌కు అతిగా సహకరిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని క్యూరేటర్ బ్రెట్ సిప్‌థోర్ప్ తెలిపాడు.

ఫాస్ట్, బౌన్సీ పిచ్
సాధ్యమైనంత వరకు ఫాస్ట్, బౌన్సీ పిచ్ తయారు చేయాలని తమకు ఆదేశాలు అందాయని సిప్‌థోర్ప్ అన్నాడు. మామూలుగానే ఆస్ట్రేలియా పిచ్‌లలో పెర్త్ బౌన్స్‌కు పెట్టింది పేరు. గతంలో ఇక్కడ ఆడిన అన్ని విదేశీ టీమ్స్ బౌన్స్‌కు బెంబేలెత్తాయి. ఈసారి దానిని మరింత బౌన్స్‌కు అనుకూలంగా మార్చడంతో భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష తప్పేలా కనిపించడం లేదు.
పెర్త్ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:
అరోన్ ఫించ్, హారిస్, ఉస్మాన్ ఖవాజా, షాన్‌మార్ష్, హ్యాండ్స్‌కబ్, ట్రావిస్ హెడ్, టిమ్‌పైన్ (వికెట్ కీపర్, కెప్టెన్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, హేజిల్‌వుడ్


Click it and Unblock the Notifications












