కోహ్లీ జట్టును బీర్ పార్టీకి పిలుస్తాం: ఆసీస్ కెప్టెన్


పెర్త్: పెర్త్ వేదికగా జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు మరో రూపం దాల్చనుంది. పైకి 'అదంతా మైదానానికి మాత్రమే పరిమితమైన సంగతి. ఇప్పుడు దాని గురించి ఆలోచించే పని కూడా లేదు' అంటూ వ్యాఖ్యలు చేశాడు కోహ్లీ. ఇటు వైపు టిమ్ పైనె వేరేలా స్పందించాడు. భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టులో కెప్టెన్లు విరాట్ కోహ్లీ, టిమ్ పైన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకానొక సమయంలో ఇద్దరూ భౌతికంగా ఢీ అనేంత దగ్గరగా వచ్చారు. పైన్ పరుగు తీస్తుంటే కోహ్లీ అతడి వద్దకు వెళ్లి ఆగిపోయాడు. దానికి పైనె ఫైర్ అయ్యాడు. ఇలా వారిద్దరి మధ్య జరిగిన వాదన అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది.

సంప్రదాయం ప్రకారం బీర్ పార్టీకి
కాగా ఆటలో ఇవన్నీ సహజమేనని టిమ్ పైన్ అన్నాడు. సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాను తమ జట్టు సంప్రదాయం ప్రకారం విందు (బీర్ పార్టీ)కు ఆహ్వానిస్తామని పేర్కొన్నాడు. మిగతా రెండు మ్యాచుల్లో ఇలాంటివి జరిగితే మాత్రం చూస్తూ వెనక్కి తగ్గబోమని వెల్లడించాడు.

విరాట్ కోహ్లీని చూడటం నాకెంతో ఇష్టం
‘ఆట హోరాహోరీగా సాగింది. విజయం కోసం రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డాయి. టీమిండియా, ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. గతి తప్పలేదు. తమ జట్లను గెలిపించేందుకు చివరి వరకు కష్టపడ్డారు. విరాట్ కోహ్లీని చూడటం నాకెంతో ఇష్టం. అతడి ఆటను ఆస్వాదిస్తాను. అందరిలోనూ అతడు పోరాట స్ఫూర్తి రగిలిస్తాడు. అదెంతో గొప్పది. రెండో టెస్టులో మా కుర్రాళ్లు స్థిరంగా నిలిచినందుకు గర్వపడుతున్నా. సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లీసేనను పార్టీకి ఆహ్వానిస్తాం. ఆటలో దూకుడు అత్యంత సహజం. అవతలి జట్టు కవ్విస్తున్నప్పుడు మేమూ వెనక్కి తగ్గం. ఇద్దరు పోటీ తత్వమున్న కెప్టెన్లు విజయం కోసం అత్యుత్తమంగా కష్టపడ్డారు' అని పైన్ అన్నాడు.

పాండ్యా, మయాంక్‌లకు స్థానం కల్పిస్తూ
ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నామని జట్టులో మార్పులుంటే వెల్లడిస్తామన్నాడు.కాగా, టీమిండియా ఇప్పటికే మూడు, నాలుగు టెస్టులకు ఆడే జట్లను ప్రకటించేసింది. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యాకు స్థానం కల్పిస్తూ.. షా గైర్హాజరీని నిర్దారించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications