రహాన్ ద్రవిడ్ వల్లే హాఫ్ సెంచరీ చేశాడా??

అడిలైడ్: టీమిండియాతో ఆస్ట్రేలియా జట్టు ఆడిన తొలి ఇన్నింగ్స్‌లో పెద్దగా రాణించలేకపోయాడు టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానె. అయినా నాలుగో రోజైన రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో హాఫ్ సెంచరీతో రాణించి ఫాం అందుకున్నాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో రహానె బ్యాట్‌పై ఓ మెరుపు మెరిసింది. దానిని కాస్తా.. కెమెరాలు క్లిక్‌మనిపించాయి. దానిపై మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ సంతకం చేసి ఉంది.
బెస్ట్ విషెస్, రాహుల్ ద్రవిడ్
ఇలా ద్రవిడ్ బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌తో ఆదివారం ఇన్నింగ్స్ ఆరంభించిన రహానె.. పుజారాతో కలిసి 87 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. రహానె బ్యాట్‌పై ‘బెస్ట్ విషెస్, రాహుల్ ద్రవిడ్' అని రాసి ఉంది. ఈ మధ్య కాలంలో రహానె ఫాం కోల్పోయి జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోలేక విఫలమయ్యేవాడు.

అప్పట్లో ద్రవిడ్ సెంచరీలతో ఇన్నింగ్స్ ముగించి:
ఆసీస్‌తో మ్యాచ్‌లో నాథన్ లైయాన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కుంటూ ధాటిగా ఆడాడు. ఒక రకంగా అతడు ఫాం అందుకోడానికి ద్రవిడ్ ఓ కారణమంటూ నెటిజన్స్ ట్విటర్‌లో పేర్కొంటున్నారు. ఇదే అడిలైడ్ మైదానంలో 2003లో ద్రవిడ్ మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించి భారత్‌కు చారిత్రక విజయం అందించాడు. ఇప్పుడు రహానె ఇన్నింగ్స్ కూడా మ్యాచ్‌ను గెలిపిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకి
ఇంతటి భారీ టార్గెట్‌ను చేధించడం ఆస్ట్రేలియాకు దాదాపు అసాధ్యమే. ఇక భారత బౌలర్లు చక్కగా రాణిస్తే విజయాన్ని త్వరగానే చేరుకోవచ్చు. ఆస్ట్రేలియాకి తొలి టెస్టులోనే పర్యాటక భారత్ జట్టు సవాల్ విసిరింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (71: 204 బంతుల్లో 9 ఫోర్లు), అజింక్య రహానె (70 బ్యాటింగ్: 147 బంతుల్లో 7ఫోర్లు) హాఫ్ సెంచరీలు బాదడంతో 323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకి భారత్ నిర్దేశించింది.

దాదాపు టీమిండియా గెలిచినట్లే
టెస్ట్ విజయం కోసం పరితపిస్తున్న ఇండియాకి ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు సుస్ఫష్టంగా కనిపిస్తున్నాయి. ఆటలో నాలుగో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 151/3తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ విఫలమవడంతో 307 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 15 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని 323 పరుగుల టార్గెట్ ఆస్ట్రేలియా ముందు నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications