For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా vs ఆస్ట్రేలియా: ఈ ఐదుగురికి ప్రతిష్టాత్మకం, ఎందుకంటే!

India vs Australia 2018 : 5 Players To Watch Out For In The India Vs Australia Test Series
India vs Australia Tests: 5 players to watch out for

హైదరాబాద్: డిసెంబర్ 6 నుంచి భారత్-ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు అడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ టెస్టు సిరిస్ పలువురి ఆటగాళ్ల కెరీర్‌కు నిర్దేశం కానుంది. అందుకు కారణం ఇటీవలే కాలంలో ఆయా ఆటగాళ్లు పేలవ ప్రదర్శనను కనబరుస్తుండటమే.

ఈ సిరిస్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు తమ కెరీర్‌ను మరింతగా పటిష్టం చేసుకోనుండగా, ఈ సిరిస్‌లో చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఇకపై టెస్టు సిరిస్‌కు ఎంపిక అవడం మరింత కష్టంగా మారనుంది. ఇప్పటికే టీమిండియా చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ పోటీని తట్టుకోవాలంటే ఈ సిరిస్‌లో మెరుగ్గా రాణించాల్సి ఉంది.

టెస్టుల్లో ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్, మురళీ విజయ్, పృథ్వీ షాల రూపంలో ముగ్గురు ఓపెనర్లను పరిశీలిస్తోంది. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరితో టీమిండియా ఈ సిరిస్‌లో బరిలోకి దిగుతుందో చూడాలి మరి. ఈ సిరిస్‌ పలువురు ఆటగాళ్లకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. వారెవరో ఒక్కసారి చూద్దామా!

కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్

గత కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేఎల్ రాహుల్‌కు చోటు కష్టంగా మారింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన చివరి టెస్టులో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ ఆ తర్వాత ఆడిన టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. భారత్ తరుపున ఇప్పటివరకు 31 టెస్టులాడిన రాహుల్ యావరేజి కనీసం 40కూడా లేకపోవడం విశేషం. ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సైతం కేఎల్ రాహుల్ విఫలం కావడంతో అతడిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు యువ ఓపెనర్ పృథ్వీషా రాణించడం తుది జట్టులో రాహుల్‌ స్థానానికి ఎసరు పెడుతోంది. దీంతో కేఎల్ రాహుల్‌కు ఈ సిరిస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.

పృథ్వీ షా

పృథ్వీ షా

అందరి కళ్లు యువ క్రికెటర్ పృథ్వీ షాపైనే ఉన్నాయి. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పృథ్వీ షాను సెలక్టర్లు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశారు. 19 ఏళ్ల పృథ్వీ షా ఓపెనర్‌గా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సైతం హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‍‌లో ఓపెనర్ పృథ్వీ షా (66: 69 బంతుల్లో 11 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (64: 87 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్), పుజారా (54: 89 బంతుల్లో 6 ఫోర్లు) రహానే (56 రిటైర్డ్ ఔట్), హనుమ విహారి (53) హాఫ్ సెంచరీలతో మెరవడంతో భారత్ 92 ఓవర్లలో 358 పరుగులు చేసి ఆలౌటంది.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

పరమితి ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ ఓ లెజెండ్. అయితే, సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మ రాణిస్తున్నప్పటికీ, టెస్టు క్రికెట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అయితే, ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో సెలక్టర్లు ఆస్ట్రేలియాతో టెస్టు సిరిస్‌కు ఎంపిక చేశారు. ఆసీస్ పిచ్‌లు రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ పర్యటనలో తప్పక రాణిస్తాడని రోహిత్ శర్మను సెలక్టర్లు ఎంపిక చేయడం జరిగింది. దీంతో ఈ సిరిస్ రోహిత్ శర్మకు ప్రతిష్టాత్మకంగా మారింది.

ఆరోన్ ఫించ్

ఆరోన్ ఫించ్

టీ20 స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన ఆరోన్ ఫించ్ ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు లేకపోవడంతో ఆరోన్ ఫించ్‌కు టెస్టు జట్టులో చోటు దక్కిందనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. టెస్టుల్లో ఆరోన్ ఫించ్ తనను తాను నిరూపించుకోవడానికి సొంతగడ్డపై ఇంతకంటే మంచి అవకాశం ఉండదు. ఈ సిరిస్‌లో గనుక ఆరోన్ ఫించే చెలరేగితో టెస్టుల్లో అతడి స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు.

ఉస్మాన్ ఖవాజా

ఉస్మాన్ ఖవాజా

ఆస్ట్రేలియా జట్టులో బద్దకం ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది ఉస్మాన్ ఖవాజానే. ఇటీవలే పాకిస్థాన్‌తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. సొంతగడ్డపై భారత్‌తో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఉస్మాన్ ఖవాజాకు కూడా ప్రతిష్టాత్మకం కానుంది. ఈ సిరిస్‌లో గనుక ఉస్మాన్ ఖవాజా రాణిస్తే వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో అతడికి చోటు దక్కడం ఖాయం.

Story first published: Thursday, November 29, 2018, 16:34 [IST]
Other articles published on Nov 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+