For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖకు చేరుకున్న టీమిండియా: ఘన స్వాగతం పలికిన అభిమానులు

India VS Australia 2019 : Team India Arrives In Vizag For T20 Series | Oneindia Telugu
India vs Australia: Team India reaches visakhapatnam for 1st t20

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు శుక్రవారం విశాఖకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెటర్లకు అధికారులతో పాటు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌ ఇండియా విమానంలో భారత క్రికెట్‌ కోచ్‌ రవిశాస్త్రితో పాటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌ తదితరులు నగరానికి చేరుకున్నారు.

మరోవైపు ఆస్ట్రేలియా జట్టు శుక్రవారం సాయంత్రానికి విశాఖకు చేరుకోనుంది. ఆస్ట్రేలియా భారత పర్యటనలో భాగంగా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఆదివారం విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరుగనుంది. కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురువారమే విశాఖకు చేరుకున్న సంగతి తెలిసిందే.

India vs Australia: Team India reaches visakhapatnam for 1st t20

ఫిబ్రవరి 24న భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఆ మ్యాచ్‌లో పాల్గొనేందుకు ధోనీ జట్టుతో పాటు కాకుండా ఒకరోజు ముందుగానే విశాఖపట్నానికి చేరుకున్నాడు. రాయ్‌పూర్‌ నుంచి గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఎయిరిండియా విమానంలో విశాఖ వచ్చిన ధోనీకి విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.

India vs Australia: Team India reaches visakhapatnam for 1st t20

తొలి టీ20కి ఆతిథ్యమిస్తోన్న విశాఖ స్టేడియంలో టీమిండియా అనేక విజయాలను అందుకుంది. మూడేళ్ల క్రితం భారత పర్యటనలో శ్రీలంక జట్టు సిరీస్‌లో చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌ను విశాఖలో ఆడింది. ఈ మ్యాచ్‌కి ముందు ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరిస్ సమం అయింది. విశాఖలో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో పాటు సిరిస్‌ను కూడా కైవసం చేసుకుంది.

Story first published: Friday, February 22, 2019, 17:57 [IST]
Other articles published on Feb 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+