టెస్టు జట్టు ప్రకటన: రోహిత్‌కు రీ ఎంట్రీ, కొత్త ఓపెనర్ ఛాన్స్

సిడ్నీ: ఆసీస్‌తో అసలైన సమరం టెస్టు సిరీస్ మొదలయ్యేందుకు 24 గంటల సమయం కూడా లేదు. ఈ క్రమంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఆసీస్‌తో బరిలోకి దిగనున్న జట్టును ప్రకటించేసింది. ఇటీవల 12 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటిస్తోన్న టీమిండియా.. అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఇదే విధానాన్ని ఫాలో అయ్యింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఓపెనర్ రోహిత్ శర్మకు అవకాశం కల్పిస్తారని భావించిన అంచనాలు నిజమైయ్యాయి.

జట్టులో ఎవరెవరు, ఎందుకని అంటే:
రోహిత్‌కు చాలా కాలం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కింది. రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్‌లను మాత్రం దూరంగానే ఉంచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో అరంగ్రేటం చేసిన ఆంధ్రా బ్యాట్స్‌మెన్ హనుమ విహారీకి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. పేస్‌కు అనుకూలించే ఆసీస్ పిచ్‌ల నేపథ్యంలో జట్టులో ఒక స్పిన్నర్‌కు మాత్రమే అవకాశం కల్పించారు. అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్న కోహ్లి.. యువ స్పిన్నర్ కుల్దీప్‌ను పక్కనబెట్టాడు. పృథ్వీ షాకు బదులుగా ఓపెనర్‌గా మురళీ విజయ్‌కు చోటు దక్కించుకున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఎలాగైనా గెలవాలని
అడిలైడ్ వేదికగా గురువారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఆసీస్ గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఈసారి ఎలాగైనా గెలవాలని కోహ్లి సేన పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన గత టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లి 692 పరుగులతో సత్తా చాటాడు. ఇటీవల ఇంగ్లాండ్‌లోనూ భారీగా పరుగులు రాబట్టాడు. 2014-15 పర్యటనలో రహానే కూడా రాణించాడు. 57 సగటుతో 399 పరుగులు చేశాడు.
ఏళ్ల తరబడి కంటున్న కల
కెప్టెన్ కోహ్లి ఇదే ఊపు కనబర్చాలని భారత్ కోరుకుంటోంది. అతడికి మిగతా బ్యాట్స్‌మెన్ సహకారం అందిస్తే.. ఆసీస్ గడ్డ మీద సిరీస్ గెలవాలన్న భారత్ కల నెరవేరనుంది. తొలి సారి ఆస్ట్రేలియా జట్టును వారి సొంతగడ్డపైనే ఓడించి చరిత్ర లిఖించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
12 మందితో కూడిన జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, హనుమ విహారీ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications