ప్లీజ్ గంభీర్ సర్.. ఫించ్, మాక్స్‌వెల్‌లను కూడా పొగడవా!! టీ20 సిరీస్ మనదే అవుతుంది!

హైదరాబాద్: ఎట్టకేలకు టీమిండియాకు ఊరట లభించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో విజయం లభించింది. క్లీన్‌స్వీప్‌ అవ్వకుండా పరువు నిలుపుకుంది. ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఆఖరి పోరులోనూ కోహ్లీసేన బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తడబడ్డా.. వెంటనే తేరుకొని గెలుపుబాట పట్టడం గమనార్హం. కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులో భారీ మార్పులు చేశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఆటగాళ్లను పక్కనపెట్టి.. బెంచ్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చాడు. దీంతో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని అందుకుంది. మరోవైపు ఆసీస్ జట్టులో డేవిస్ వార్నర్ లేకపోవడం కూడా టీమిండియాకు కలిసొచ్చింది.

స్మిత్ ప్యూర్ క్లాస్ ఆటగాడు:

స్మిత్ ప్యూర్ క్లాస్ ఆటగాడు:

తొలి రెండు వన్డేల్లో 62 బంతుల్లోనే సెంచరీలు బాది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్‌ స్టీవ్ స్మిత్.. మూడో వన్డేలో 7 పరుగులకే ఔట్ అయ్యాడు. 15 బంతులు ఎదుర్కొని ఒక్క బౌండరీ కూడా బాధలేదు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే రెండో వన్డే అనంతరం టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మట్లాడుతూ.. స్మిత్ ప్యూర్ క్లాస్ ఆటగాడని కొనియాడాడు. వరుసగా రెండు సెంచరీలు బాదిన స్మిత్.. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీకి చేరువలో ఉన్నాడని ప్రశంసించాడు.

స్మిత్ విఫలం:

స్మిత్ విఫలం:

గౌతమ్ గంభీర్ ప్రశంసించిన మరుసటి మ్యాచ్‌లోనే స్టీవ్ స్మిత్ విఫలం అయ్యాడు. మరోవైపు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ (63) బాదాడు. ఇదివరకు ఐపీఎల్ 2020 ఫైనల్‌కు ముందు మార్కస్ స్టోయినిస్‌ను గౌతీ పొగడగా.. తర్వాతి మ్యాచ్‌లోనే అతడు విఫలమయ్యాడు. ఇప్పుడు స్మిత్ విషయంలో అదే జరిగింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు. గంభీర్ వల్లే భారత్ మ్యాచ్ గెలిచిందని సెటైర్లు వేస్తున్నారు. ఇక ఆరోన్ ఫించ్, గ్లెన్ మాక్స్‌వెల్‌లను కూడా గంభీర్ పొగిడితే బాగుంటుందని నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు.

గంభీర్ ప్రశంసించిన మరుసటి మ్యాచ్‌లోనే:

గంభీర్ ప్రశంసించిన మరుసటి మ్యాచ్‌లోనే:

మూడు వన్డే మ్యాచులలో ఆరోన్ ఫించ్, గ్లెన్ మాక్స్‌వెల్‌లు అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఫించ్ వరుసగా 114, 60, 75 పరుగులు చేశాడు. ఇక మాక్స్‌వెల్ అయితే విధ్వంసమే సృష్టించాడు. తొలి వన్డేలో 3 సిక్సులు బాది 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. రెండో వన్డేలో 4 భారీ సిక్సులతో 29 బంతుల్లోనే 63 రన్స్ చేశాడు. మూడో వన్డేలో కూడా 38 బంతుల్లో 59 రన్స్ చేశాడు. ఈరోజు కూడా మరో నాలుగు సిక్సులు బాదాడు. గౌతమ్ గంభీర్ ప్రశంసించిన మరుసటి మ్యాచ్‌లోనే అందరూ విఫలమవుతుండడంతో.. టీమిండియా ఫాన్స్ వీరిద్దరిని కూడా పొగడమని గౌతిని వేడుకుంటున్నారు.

ఫించ్, మాక్స్‌వెల్‌లను కూడా పొగడవా:

ఫించ్, మాక్స్‌వెల్‌లను కూడా పొగడవా:

'గంభీర్ సర్.. ఫించ్, మాక్స్‌వెల్‌లను కూడా పొగడవా!! టీ20 సిరీస్ మనదే అవుతుంది' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 'టెస్టులకు కూడా ఇలానే ఎంకరేజ్ చేస్తే బాగుండు గంభీర్ సర్' అని మరొకరు ట్వీట్ చేయగా.. 'మ్యాచ్ ఆడకుండానే వికెట్ తీసిన ఒకేఒక్కడు గౌతమ్ గంభీర్' అని ఇంకొకరు ట్వీటారు. స్మిత్ వైఫల్యానికి కారణం గంభీర్.. టీ20 సిరీస్‌లో కూడా ఫించ్, మాక్స్‌వెల్‌ను శపిస్తాడని ఆశిస్తున్నా' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పరుగుల రారాజుకు ఏమైంది!! 12 ఏళ్ల త‌ర్వాత తొలిసారి.. ఒక్క సెంచరీ బాదని విరాట్ కోహ్లీ!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, December 2, 2020, 23:05 [IST]
Other articles published on Dec 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X