బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని సంపాదించా!! కోహ్లీ.. మీ టీమ్‌లో నాకు చోటిస్తావా: స్టార్‌ ఫుట్‌బాలర్

లండన్‌: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్‌, ప్రీమియ‌ర్ లీగ్ క్ల‌బ్ టోటెన్‌హామ్ హాట్‌స్ప‌ర్ ప్లేయ‌ర్ అయిన హ్యారీ కేన్‌.. టీమిండియా కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. హ్యారీ సహచర ఆటగాళ్లతో కలిసి సరాదాగా క్రికెట్‌ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఈ వీడియోలో ఇంగ్లాండ్ గోల్‌కీపర్ జో హార్ట్ బౌలింగ్ చేస్తుండగా.. హ్యారీ బ్యాటింగ్ చేశాడు. కొన్ని షాట్లు దూకుడుగా ఆడిన హ్యారీ చివరికి బౌల్డ్ అయ్యాడు.

'టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడానికి కావాల్సిన బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని సంపాదించా. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ జట్టులో నాకు స్థానం ఉంటుందా?' అని హ్యారీ కేన్‌ ట్వీట్ చేశాడు. దానికి విరాట్ కోహ్లీని ట్యాగ్ చేశాడు. అయితే కోహ్లీ ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. ఎటాకింగ్ బ్యాట్స్‌మన్‌గా పరిగణించి హ్యారీని జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని సరదాగా ట్వీటాడు. 'మంచి నైపుణ్యం. ఎటాకింగ్ బ్యాట్స్‌మన్‌గా నిన్ను జట్టులోకి తీసుకోవచ్చు' అని నవ్వుతున్న ఎమోజీలను జోడించి కోహ్లీ రీట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇంగ్లండ్‌ క్రికెటర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ సైతం ఈ వీడియోపై స్పందించాడు. హ్యారీ కేన్‌.. నువ్ బాగా ఆడుతున్నావని, 2021 ఐపీఎల్‌ వేలంలో పాల్గొనాల్సిందిగా సూచించాడు. కాగా 27 ఏళ్ల హ్యారీ ఈ ఏడాది ప్రీమియర్‌ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు గోల్స్‌ చేసిన హ్యారీ.. 20 పాయింట్లతో టోటెన్‌హామ్ హాట్‌స్ప‌ర్ జట్టును అగ్రస్థానంలో నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి చేసిన ప్రతిపాదనపై ఇంత‌కుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా స్పందించింది. 'నీ కోసం ఇప్పుడే జెర్సీ నంబరు 10 సిద్ధం చేసి పెట్టాం' అంటూ ట్వీట్ చేసింది. ఐపీఎల్ 2020లో ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ప్రస్తుతం కోహ్లీ ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో రెండో మ్యాచులో తలపడుతుంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.

రసెల్ విధ్వంసం.. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!! 5 ఓవర్లకు 96 పరుగులు!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Sunday, November 29, 2020, 10:26 [IST]
Other articles published on Nov 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X