Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుంతలకిడి గుల గుల గుల.. ఉప్పల్.. ఉప్పల్..! మనదే టాస్, ముందు బౌలింగ్, అందుకే పంత్ ఔట్, తుది జట్టు ఇదే!

India Vs Australia T20Is Series: India Won The Toss and Elected to Bowl First

హైదరాబాద్ : ఎన్నాళ్లకెన్నాళ్లకు ఉప్పల్ స్టేడియానికొనికి ఊపొచ్చింది. ఇంటర్నేషనల్ స్టేడియం అయినప్పటికీ.. తనివితీరా ఈ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మాజీ ఆస్వాదించి ఎన్నాళ్లయిందో. ఎలాగైనా సరే మ్యాచ్ చూడాలని తెలంగాణలోని హైదరాబాద్ పరిసర జిల్లాల యువకులు, అభిమానులు టిక్కెట్ల కోసం ఎంత పెద్ద పోరాటం చేశారో మనకు తెలిసిందే.

అన్నీ అడ్డంకులు దాటి మరీ మన టీమిండియా మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి అభిమాన దళం తరలొచ్చింది. టీమిండియా ప్లేయర్స్ కమాన్.. మీ ఆట కోసం వేయి కన్నులతో వేచిచూస్తున్నాం. మీరు షాట్లు కొడుతుంటే స్టేడియం దద్దరిల్లే ప్రోత్సాహం ఇస్తాం.. మీరు వికెట్ తీస్తే దిక్కులు పిక్కటిల్లేలా హోరెత్తిస్తాం. గుంతలకిడి గులగుల ఊహ ఊహ, ఇంకా రకరకాల మా డిఫరెంట్ నినాదాలతో అంతులేని అభిమానాన్ని చూపుతాం. మీకోసం మేము.. మాకోసం మీరు గెలవాలని కోరుకుంటున్నాం.

దద్దరిల్లిన స్టేడియం

ఇకపోతే టీ20ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియాతో సన్నాహకంగా జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో ఉప్పల్ మ్యాచ్ డిసైడర్‌గా మారింది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ అసలు సిసలు పోరుకు టీమిండియా భారీగానే సన్నద్ధమైంది. నాగ్‌పూర్‌లో సాధించిన విజయంతో రెట్టించిన ఆత్మవిశ్వాసాన్ని అందుకున్న టీమిండియా.. చివరి మ్యాచ్‌లోనూ అదే జోరు కనబర్చాలని భావిస్తోంది. జట్టులోకి జస్‌ప్రీత్ బుమ్రా తిరిగిరావడం కలిసొచ్చింది. హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ గాడిన పడాల్సిన అవసరముంది. ఇకపోతే ఈ మ్యాచ్ టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలుత బౌలింగ్ ఎంచుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక టాస్ సమయంలో క్రౌడ్ చీరింగ్‌కు స్టేడియం దద్దరిల్లింది.

హైదరాబాద్ ప్రజలు ఎంత ఆత్రుతగా ఉన్నారో..!

టాస్ గెలిచిన రోహిత్ మాట్లాడుతూ.. మూడు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడుతున్నాం. ఈ క్రౌడ్ చూస్తుంటే వాళ్లు క్రికెట్ కోసం ఎంత ఆత్రుతగా ఉన్నారో అర్థమవుతుంది. మేము గత మ్యాచ్ రిజల్ట్ కొనసాగించాలని చూస్తున్నాం. ఈ గేమ్ ఫార్మాట్‌లో వేగంగా ఆడడం చాలా ముఖ్యం. మాకు నాగ్‌పూర్‌లో మంచి విజయం దక్కింది. ఆస్ట్రేలియా టీం ఎల్లప్పుడూ సవాలు విసురుతూనే ఉంటుంది. ముందు విజయం సాధించాలంటే ఏం చేయాలో అది సరిగ్గా చేస్తూనే ఉండాలి. చివరి విజయం మా ఆత్మవిశ్వాసం పెంపొందించింది. మా జట్టులో ఒక మార్పు. పంత్‌ను తొలగించాం. భువీ తిరిగి జట్టులోకి వచ్చాడు. చివరి గేమ్‌లో మాకు కేవలం 4బౌలర్లు మాత్రమే అవసరం కాబట్టి భువనేశ్వర్ కుమార్‌ను తప్పించి పంత్‌ను తీసుకున్నాం. ఇప్పుడు పంత్ కన్నా భువీ ముఖ్యం కాబట్టి అతన్ని తీసుకున్నాం.' అని రోహిత్ చెప్పాడు.

తుది జట్లు :

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్ (w), డేనియల్ సామ్స్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

Story first published: Sunday, September 25, 2022, 18:47 [IST]
Other articles published on Sep 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+