'కోహ్లీని అవుట్ చేయడం ఎలా అని రాత్రంతా ఆలోచించాం'
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ఎలా? అని రాత్రంతా కూర్చుని చర్చించామని ఆస్ట్రేలియా వికెట కీపర్ టిమ్ పైనీ వెల్లడించాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 రాంచీ వేదికగా శనివారం రాత్రి 7 గంటలకు జరగనుంది.

మాథ్యూ వేడ్ పేలవ ప్రదర్శనతో పైనీకి చోటు
ఐదు వన్డేల సిరిస్‌లో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా ఉన్న మాథ్యూ వేడ్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. దీంతో అతని స్ధానంలో టీ20 సిరిస్‌లో టిమ్ పైనీని జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టిమ్ పైనీ శనివారం మీడియాతో మాట్లాడాడు. 'కోహ్లీ మంచి ఆటగాడు. రాంచీ టీ20లో కోహ్లీ వికెట్ మాకు చాలా కీలకం. ఎందుకంటే ఆసీస్‌పై ఈ ఫార్మాట్‌లో అతనికి మంచి రికార్డు ఉంది' అని అన్నాడు.

కోహ్లీ వికెట్ తీయడం గురించి సుదీర్ఘ చర్చ
శుక్రవారం రాత్రి టీమ్ మీటింగ్‌లో కోహ్లీ వికెట్ తీయడం గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. కోహ్లీని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్‌కు పంపాలనే దానిపై రాత్రంతా మేల్కొని చర్చించాం. ఆ వివరాలను ప్రస్తుతం నేను బహిర్గతం చేయలేను. కానీ.. అతని కోసం మా జట్టు రెండు ప్రణాళికల్ని మాత్రం సిద్ధం చేసి ఉంచింది. మ్యాచ్‌లో అవి ఎలా అమలవుతాయో చూడాలి' అని తెలిపాడు.

భారత జట్టు మంచి క్రికెట్ ఆడుతోంది
'కోహ్లీతో పాటు జట్టు కూడా ప్రస్తుతం చాలా మంచి క్రికెట్ ఆడుతోంది. ఆటగాళ్లందరూ ఆత్మవిశ్వాసంతోనే ఎంతో మెరుగ్గా రాణించగులుగుతున్నారు. 1-4తో వన్డే సిరీస్‌ను కోల్పోయాం. టీ20 సిరీస్‌ను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాం. మ్యాక్స్‌వెల్, ఫించ్, వార్నర్‌తో మా బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. విజయం ఎవరిని వరిస్తుందో చూద్దాం' అని పైనీ అన్నాడు.

ఆస్ట్రేలియాపై కోహ్లీకి మంచి రికార్డు
ఇదిలా ఉంటే టీ20ల్లో ఆస్ట్రేలియాపై కోహ్లీకి మంచి రికార్డు ఉంది. టీ20ల్లో కోహ్లీ అత్యధిక స్కోరు ఆస్ట్రేలియాపైనే నమోదు చేయడం విశేషం. ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ని ఆస్ట్రేలియా 1-4తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. గాయం కారణంగా స్టీవ్ స్మిత్ జట్టుకి దూరం కాగా, ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications