Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిడ్నీ టెస్టు: ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ వా తనయుడు

India vs Australia: Steve Waughs son, Austin, gets special call-up for Sydney Test

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా కుమారుడు ఆస్టిన్ వా ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్‌తో గురువారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టులో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఆస్టిన్ వా ఎంపికయ్యాడు.

కాగా, స్థానిక యువ ఆటగాళ్లను ఆస్ట్రేలియా జట్టు ఎమర్జెన్సీ ఫీల్డర్లుగా, ఎక్స్‌ట్రా సభ్యులుగా జట్టులోకి తీసుకోవడం ఎప్పటి నుంచో జరుగుతుంది. అందులో భాగంగా ఆస్టిన్ వాను సిడ్నీ టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. 2004లో స్టీవ్ వా ఇదే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియాతోనే చివరి మ్యాచ్ ఆడటం విశేషం.

5 ఏళ్ల తర్వాత ఆస్టిన్ వా అదే మైదానంలో

అంతర్జాతీయ క్రికెట్‌కు తండ్రి వీడ్కోలు పలికిన 15 ఏళ్ల తర్వాత ఆస్టిన్ వా అదే మైదానంలో ఆడిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు. గురువారం బౌండరీ లైన్ దగ్గర కూర్చున్న ఆస్టిన్ వా ఆసీస్ ఆటగాళ్లకు విరామ సమయంలో డ్రింక్స్ అందించాడు. ఆసీస్ తుది జట్టులో స్థానం దక్కని ఆటగాళ్లను బిగ్‌బాష్ లీగ్ కోసం రిలీజ్ చేసినప్పుడు జట్టు మేనేజ్‌మెంట్ ఇలా చేస్తుంది.

క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన

క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన

స్టీవ్ వా లక్షణాలను పుణికిపుచ్చుకుంటూ ఆస్టిన్ వా పిన్న వయస్సులోనే క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది జరిగిన అండర్-17 జాతీయ చాంపియన్‌షిప్‌లో సెంచరీ(122 నాటౌట్) సాధించడం ద్వారా ఆస్టిన్ వెలుగులోకి వచ్చాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఆస్టిన్ వా ఎదుర్కొన్న తీరు అద్భుతం.

సౌత్‌వేల్స్ తరఫున ఆడుతోన్న ఆస్టిన్ వా

సౌత్‌వేల్స్ తరఫున ఆడుతోన్న ఆస్టిన్ వా

దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న ఆస్టిన్.. అనతికాలంలోనే సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. న్యూజిలాండ్‌లో మొదలయ్యే అండర్-19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ఆస్టిన్ సారథ్యం వహించాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో న్యూ సౌత్‌వేల్స్ తరఫున ఆడుతున్నాడు. సదర్లాండ్‌లో స్టీవ్ స్మిత్‌తో సిడ్నీలో టీ20 గ్రేడ్ క్రికెట్ ఆడిన ఆస్టిన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.

Story first published: Thursday, January 3, 2019, 19:10 [IST]
Other articles published on Jan 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+