Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: 62 బంతుల్లో సెంచరీ.. స్మిత్‌ అరుదైన రికార్డు!!

India vs Australia: Steve Smith scores third fastest ODI ton for Australian
Ind vs Aus 2nd ODI : Steve Smith Smashes Consecutive Centuries Against India

సిడ్నీ: సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 389 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాజీ కెప్టెన్ స్టీవ్ ‌స్మిత్‌ (104; 64 బంతుల్లో 14x4, 2x6) మెరుపు శతకంతో పాటు టాప్‌ ఆర్డర్‌ మొత్తం చెలరేగారు. 62 బంతుల్లో సెంచరీ చేసిన స్మిత్‌ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరపున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా స్మిత్ రికార్డుల్లోకి ఎక్కాడు.

51 బంతుల్లోనే శతకం బాదిన గ్లెన్ మాక్స్‌వెల్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. జేమ్స్ ఫాల్కనర్ (57) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. స్మిత్ (62) మూడు, నాలుగు (62) స్థానాల్లో ఉన్నాడు. తొలి వన్డేలో స్మిత్ 62 బంతుల్లో శతకం చేశాడు. మాథ్యూ హేడెన్ 66 బంతుల్లోనే సెంచరీ చేసి ఐదవ స్థానంలో ఉన్నాడు.

స్టీవ్‌ స్మిత్‌ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. మొదటి వన్డేలో 66 బంతుల్లో 105 పరుగులు చేసిన స్మిత్‌.. రెండో వన్డేలో మరింత దూకుడుగా ఆడాడు. కేవలం 62 బంతుల్లోనే 100 పరుగులు సాధించిన స్మిత్..‌ 104 పరుగుల వద్ద హార్దిక్‌ పాం‍డ్యా బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఓవరాల్‌గా వన్డేల్లో స్మిత్‌ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా.. అందులో టీమిండియాపైనే 5 సాధించాడు. భారత్‌పై 5 కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఆసీస్‌ ఆటగాళ్లలో రికీ పాంటింగ్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. పాంటింగ్‌ టీమిండియాపై ఆరు సెంచరీలు సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే పాంటింగ్‌ 6 సెంచరీలు సాధించడానికి 59 మ్యాచ్‌లు తీసుకోగా.. స్మిత్‌ 20 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును సాధించడం విశేషం.

డేవిస్ వార్నర్-ఆరోన్ ఫించ్ దెబ్బకు భారత క్రికెట్ జట్టు వన్డే చరిత్రలోనే చెత్త రికార్డును మూటగట్టుకుంది. తొలి వన్డేలో మొదటి వికెట్‌కు 156 పరుగులు జోడించిన ఆసీస్ ఓపెనర్లు.. రెండో వన్డేలోనూ 142 పరుగులు జోడించారు. టీమిండియా ఇప్పటి వరకూ 978 వన్డేలు ఆడగా.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టు ఓపెనర్లు శతక భాగస్వామ్యం నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు మార్టిన్ గుప్టిల్, నికోలస్ జోడీ.. మౌంట్ మౌంగనుయ్‌లో తొలి వికెట్‌కు 106 రన్స్ జోడించారు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజీలాండ్ పర్యటనకు భారత్ వెళ్ళింది.

ఫించ్-వార్నర్ జోడికి వన్డేల్లో ఇది 12వ శతక భాగస్వామ్యం కాగా.. భారత్‌పై ఐదోది కావడం విశేషం. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనింగ్ జోడిగా గిల్‌క్రిస్ట్-హెడెన్ (16) తొలి స్థానంలో ఉండగా.. పాంటింగ్-క్లార్క్ (11)ను తాజాగా వార్నర్, ఫించ్ వెనక్కి నెట్టారు. వన్డే చరిత్రలో అత్యధిక శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన రికార్డ్ సచిన్-గంగూలీ జోడీ పేరిట ఉంది. వీరిద్దరూ 21సార్లు సెంచరీ పార్టనర్‌షిప్ నెలకొల్పారు.

Story first published: Sunday, November 29, 2020, 15:16 [IST]
Other articles published on Nov 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+