Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా vs ఆస్ట్రేలియా: అడిలైడ్ టెస్టులో నమోదైన రికార్డులివే

India vs Australia, stats highlights: Rishabh Pants record-equalling feat to Virat Kohlis captaincy heroics

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్‌నైట్ స్కోరు 104/4తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 291 పరుగులకు ఆలౌటైంది.

ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్ట్ గెలవడం భారత్‌కు ఇదే మొదటిసారి. భారత తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 14 నుంచి పెర్త్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.

1
43624

తొలి టెస్టులో నమోదైన రికార్డులివే:

 గత పదేళ్ల కాలంలో భారత్ నిర్దేశించిన

గత పదేళ్ల కాలంలో భారత్ నిర్దేశించిన

0 - అడిలైడ్‌లో గత 100 ఏళ్లలో ఏ ఆస్ట్రేలియా జట్టు కూడా 200పై చిలుకు లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించలేకపోయింది. గత పదేళ్ల కాలంలో భారత్ నిర్దేశించిన 200పైగా లక్ష్యాన్ని ఏ జట్టు అందుకోలేకపోయింది. చివరిసారి 2006-07లో కేప్‌టౌన్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.

1 - ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్ట్ గెలువడం భారత్‌కు ఇదే మొదటిసారి. గత 11 పర్యాయాలు రెండు సార్లు డ్రా, 9 సార్లు ఓటములు ఎదుర్కొంది. ఆస్ట్రేలియా పర్యటనకు భిన్నంగా ఇంగ్లాండ్‌లో(1986), దక్షిణాఫ్రికాలో(2006) ఒకసారి, న్యూజిలాండ్‌లో మూడుసార్లు, వెస్టిండీస్‌లో రెండుసార్లు తొలి టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది.

 విదేశాల్లో మూడు టెస్ట్‌ల్లో గెలువడం ఇదే మొదటిసారి

విదేశాల్లో మూడు టెస్ట్‌ల్లో గెలువడం ఇదే మొదటిసారి

1 - ఒక క్యాలెండర్ సంవత్సరంలో విదేశాల్లో మూడు టెస్ట్‌ల్లో గెలువడం 1968 తర్వాత భారత్‌కు ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌పై మూడు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది.

3 - తక్కువ పరుగుల తేడాతో టెస్ట్‌ల్లో గెలువడం భారత్‌కు ఇది మూడో సారి. అంతకముందు(2004-5)లో ఆస్ట్రేలియాపై 13 పరుగులు, 1972-73లో ఇంగ్లాండ్‌పై 28 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

50 పరుగుల లోపే నాలుగు వికెట్లు

50 పరుగుల లోపే నాలుగు వికెట్లు

3 - మొదటి బ్యాటింగ్ చేసి 50 పరుగుల లోపే తొలి నాలుగు వికెట్లు కోల్పోయి గెలువడం భారత్‌కు ఇది మూడోసారి. గతం(1974-75)లో వెస్టిండీస్‌పై, ఆస్ట్రేలియాపై(2004-05) విజయం సాధించింది.

6 - ఆస్ట్రేలియాలో భారత్ గెలిచిన టెస్ట్‌లు. గత 35 ఏళ్లలో ఇది రెండో విజయం కావడం విశేషం. అడిలైడ్(2003), పెర్త్(2008)లో విజయం సాధించిన టీమిండియా 1977-78, 1980-81 వరుస పర్యటనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.

అడిలైడ్ టెస్టులో ప్రపంచ రికార్డు

అడిలైడ్ టెస్టులో ప్రపంచ రికార్డు

35 - అడిలైడ్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌లో నమోదైన క్యాచ్‌ల సంఖ్య. టెస్ట్‌ల్లో ఇది ప్రపంచ రికార్డుగా నమోదైంది. ఇరు జట్ల రెండు ఇన్నింగ్స్‌లో వికెట్లన్నీ క్యాచ్ ఔట్లే కావడం విశేషం. ఈ ఏడాది మొదట్లో కేప్‌టౌన్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా 34 క్యాచ్‌లు నమోదయ్యాయి.

Story first published: Tuesday, December 11, 2018, 11:22 [IST]
Other articles published on Dec 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+