రోహిత్ శర్మను No. 6 స్పాట్‌లో ఆడించు: కోహ్లీకి గంగూలీ సలహా


హైదరాబాద్: వెస్టిండిస్‌తో ముగిసిన పరిమిత ఓవర్ల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. భారత టెస్టు జట్టులో రోహిత్ శర్మ ఎంపిక కావడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.
సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా వచ్చే రోహిత్ శర్మను టెస్టుల్లో ఇప్పుడు ఏ స్థానంలో బరిలోకి దించాలనే ఆయోమయంలో జట్టు మేనేజ్‌మెంట్ తర్జనభర్జనలు పడుతోంది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో రోహిత్ శర్మ ఆరో నంబర్ స్థానానికి చాలా చక్కగా సరిపోతాడని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు.
ప్రస్తుతం టెస్టు జట్టులో ఓపెనర్లుగా మురళీ విజయ్, కేఎల్ రాహుల్, యువ ఆటగాడు పృథ్వీ షాల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. తాజాగా రోహిత్ శర్మ కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడంతో అతడిని ఆరో స్థానంలో వినియోగంచుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీకి గంగూలీ సూచించాడు.

ఓపెనర్లుగా బరిలోకి విజయ్ లేదా రాహుల్?
"మురళీ విజయ్, కేఎల్ రాహుల్ లేదా పృథ్వీ షా వీరిలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఓపెనర్లుగా బరిలోక దిగుతారు. ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజ్యింకే రహానేలు ఆ తర్వాత క్రీజులోకి వస్తోండటంతో టాప్-5 వరకు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటుంది. No. 6 స్పాట్‌కు రోహిత్ శర్మ చక్కగా సరిపోతాడు" అని గంగూలీ అన్నాడు.

రోహిత్ శర్మను No. 6 స్థానంలో బరిలోకి దింపుతా
"నన్ను అడిగితే No. 6 స్థానంలో రోహిత్ శర్మను బరిలోకి దింపుతా. ఇక, బౌలింగ్ విషయానిక వస్తే ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ను తీసుకుంటా. రోహిత్ శర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో అతడిని No. 6 స్థానానికి వినియోగించుకుంటే మంచిదని నా అభిప్రాయం. రోహిత్ శర్మ రాకతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలోపేతం అవుతుంది" అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

హార్దిక్ పాండ్యా గాయం కారణంగా
"ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ సిరిస్‌కు దూరం కావడంతో జట్టు మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో(రిషబ్ పంత్‌తో కలిపి) ఆడాలా లేదా నలుగురు పేసర్లతో వెళ్లాలా? అని జట్టు మేనేజ్‌మెంట్ తేల్చుకోలేని పరిస్థితి. అలా కాకుండా ఒక్కో డిపార్ట్‌మెంట్ నుచి ఐదుగరు స్పెషలిస్ట్‌లతో ఆడాలా? మోడ్రన్ డే క్రికెట్‌లో ఓ కెప్టెన్ ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్య ఇది" అని గంగూలీ అన్నాడు.

ఇంతకంటే మంచి తరుణం మరొకటి ఉండదు
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా సిరీస్ విజయం సాధించడానికి ఇంతకంటే మంచి తరుణం మరొకటి ఉండదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకపోవడంతో ఆస్ట్రేలియా ప్రస్తుతం చాలా బలహీనంగా ఉందని అన్నాడు. "భారత జట్టులో కోహ్లి, రోహిత్ లేకుంటే ఎలా ఉంటుంది? అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుంది. ఇది భారత జట్టుకు గొప్ప అవకాశం. ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇంతకంటే మంచి తరుణం మరొకటి ఉండదు" అని గంగూలీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications