
కోహ్లీసేనకు మద్దతుగా నిలిచిన గంగూలీ
పెర్త్ టెస్టులో భారత్ ఓటమికి జట్టు ఎంపికే కారణమంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, ఈ సిరిస్‌లో భాగంగా జరగనున్న మిగతా రెండు టెస్టుల్లో టీమిండియా ఓటమి ఖాయమంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ గంగూలీ జట్టుగా మద్దతుగా నిలిచాడు.
ఇంకా రెండు టెస్టులు మిగిలున్నాయి
"టీమిండియా గురించి అన్ని మీడియాలు చాలా ఎక్కువగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా మీడియా. ఆసీస్‌పై ఇక టీమిండియా గెలవలేదని మీడియాలోనూ, సోషల్ మీడియాలో సైతం చర్చిస్తున్నారు. టీమిండియా గెలవడానికి ఇంకా రెండు టెస్టులు మిగిలే ఉన్నాయి. కాబట్టి అవి రెండూ పూర్తవ్వకముందే చాలా దూరం వెళ్లకండి" అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

రెండో టెస్టులో ఎనిమిది వికెట్లు తీసిన నాథన్ లియాన్
పేసర్లకు అనుకూలించే పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ఎనిమిది వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సైతం అందుకున్నాడు. ఈ సిరిస్‌లో కోహ్లీ ఎక్కవసార్లు నాథన్ లియాన్ బౌలింగ్‌లోనే ఔట్ కావడం విశేషం. దీంతో కోహ్లీకి కూడా గంగూలీ ఓ సలహా ఇచ్చాడు.

కోహ్లీకి నేనిచ్చే సలహా ఇదే
రాబాయే రెండు టెస్టుల్లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్‌పై సరైన ప్రణాళికను రచించాలని గంగూలీ సూచించాడు. కోహ్లీ సైతం లియాన్ బౌలింగ్‌లో వికెట్ పారేసుకోకుండా జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. "కోహ్లీకి మెసేజ్ పంపాలని అనుకున్నా. అయితే, ఇంకా పంపలేదు. ఉపఖండం బయట స్పిన్నర్లకు ఎక్కువ వికెట్లు ఇవ్వకూడదని అతడికి చెబుతున్నా. నాథన్ లియాన్ గొప్ప స్పిన్నర్ అనడంలో సందేహం లేదు. కానీ గతంలో షేన్ వార్నే, ముత్తయ్య మురళీధరన్, గ్రేమ్ స్వాన్ లాంటి దిగ్గజాలను ఎదుర్కొన్నాం" అని అన్నాడు.
లియాన్ బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ అతిగా ఢిపెన్స్ ఆడారు. ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా విసిరిన బంతులను కూడా ఢిపెన్స్ ఆడారు. దానికి బదులు లియాన్‌పై ఎదురు దాడికి దిగాలి. 300-350కిపైగా పరుగులు రాబట్టాలని కోహ్లి సేనకు గంగూలీ సూచించాడు. 2014లో ఆసీస్ గడ్డ మీద టెస్టు ఆడిన అనుభవం ఉన్నప్పటికీ.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ప్రస్తుత ఆసీస్ టూర్లో రాణించలేకపోవడం పట్ల దాదా అసంతృప్తి వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications













