హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా రాంచీ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఆసీస్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌కు ఎంపికైనప్పటికీ, భార్య అనారోగ్యం కారణంగా ధావన్ తనంతట తానే వన్డే సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
కాగా, శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరిస్ కోసం జట్టులోకి తిరిగి వచ్చిన ధావన్ ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించాడు. తొలి టీ20 జరిగే రాంచీలో వర్షం పడుతుండటంతో మైదానాన్ని స్టేడియం సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. దీంతో జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
దీంతో జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఇండోర్ స్టేడియంలో ధావన్ నెట్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో ధావన్ స్వీప్ షాట్‌తో పాటు బౌన్సర్లని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసేలా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. శ్రీలంకతో ముగిసిన టెస్టు, వన్డే సిరీస్‌లో ధావన్ మెరుగ్గా రాణించిన సంగతి తెలిసిందే.