న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్ మాయతో 130ఏళ్ల చెత్త రికార్డును నెత్తినేసుకున్న మార్ష్

India vs Australia: Shaun Marsh breaks unwanted 130-year-old record in Adelaide Test

న్యూ ఢిల్లీ: భారత బౌలర్లు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌పై పగ తీర్చుకుంటున్నారు. తొలి ఓవర్లోనే ఇషాంత్ విసురుగా బౌలింగ్ వేసి ఫించ్ వికెట్ తీశాడు. అదే స్థాయిలో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ ధాటికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ 130 ఏళ్ల నాటి చెత్త రికార్డులో చేరాడు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ స్టంప్‌కి దూరంగా అశ్విన్ విసిరిన బంతిని షాన్ మార్ష్ హిట్ చేసేందుకు ప్రయత్నించగా.. బ్యాట్ అంచున తాకిన బంతి.. నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది.

'రాహుల్‌ను జట్టు నుంచి వేటు వెయ్యండి' 'రాహుల్‌ను జట్టు నుంచి వేటు వెయ్యండి'

1888 తర్వాత సింగిల్ డిజిట్‌కే ఔటయిన

ఇలా 2 పరుగుల వ్యక్తిగత స్కోరు మాత్రమే నమోదు చేసిన షాన్ మార్ష్ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. టెస్టుల్లో షాన్ మార్ష్ ఇలా సింగిల్‌ డిజిట్‌‌కే వరుసగా ఔటవడం ఇది ఆరోసారి. కాగా, 1888 తర్వాత ఏ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఇలా ఆరు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్‌కి ఔటయిన దాఖలా లేదు. పేలవ ఫామ్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న షాన్ మార్ష్ గత 13 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్కసారి కూడా 40+ స్కోరు చేయలేకపోవడం గమనార్హం.

ముగ్గురూ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌లే

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకి ఆలౌటవగా.. ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం 125/5తో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో షాన్ మార్ష్‌తో పాటు హారిస్ (26), ఉస్మాన్ ఖవాజా (28) వికెట్లను కూడా అశ్విన్ పడగొట్టాడు. ఈ ముగ్గురూ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ కావడం కొసమెరుపు.

59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

తొలి వికెట్ ఫించ్ అవుట్ అనంతరం క్రీజులోకి వచ్చిన మార్కస్‌ హారిస్‌-ఉస్మాన్‌ ఖవాజాల జోడి స్కోరు బోర్డుని నడిపించారు. వీరిద్దరూ కలిసి 45 పరుగులు జోడించిన తర్వాత హారిస్‌(26) రెండో వికెట్‌గా అశ్విన్‌ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కు క్యాచ్‌ ఇచ్చి హారిస్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత స్పల్ప వ్యవధిలోనే షాన్‌ మార్ష్‌(2)ని అశ్విన్‌ పెవిలియన్‌కు చేర్చడంతో ఆస్ట్రేలియా 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

1
43623
Story first published: Friday, December 7, 2018, 12:18 [IST]
Other articles published on Dec 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X