కోహ్లీ గ్రేటెస్ట్ క్రికెటర్: బాక్సింగ్ డే టెస్టుపై షేన్ వార్న్ స్పెషల్ వీడియో

హైదరాబాద్: బాక్సింగ్ డే టెస్టు... ఈ టెస్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా క్రిస్టమస్‌ను ఘనంగా జరుపుకునే ఆస్ట్రేలియన్లకు బాక్సింగ్ డే టెస్టు అంటే ఎంతో ప్రత్యేకం. ప్రతి ఏటా క్రిస్మస్ మరుసటి రోజు ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్‌కు వేల మంది క్రికెట్ అభిమానులు తరలివస్తారు.
ఆస్ట్రేలియా ఏ జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడినా బాక్సింగ్ డే టెస్టుకు పెద్ద ఎత్తున అభిమానులు మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూసేందుకు మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)కి తరలివస్తారు. గతేడాది యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌ని ఆడిన ఆస్ట్రేలియా ఈసారి భారత్‌తో బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ఆడనుంది.
బాక్సింగ్ డే టెస్ట్ ప్రాముఖ్యతను వివరిస్తూ
ఈ సందర్భంగా బాక్సింగ్ డే టెస్ట్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఓ వీడియోని తన ఫేస్‌బుక్ పేజిలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోని ఆసీస్ మాజీ లెజెండరీ క్రికెటర్ బ్రెట్ లీ షేర్ చేయడం విశేషం. ఇప్పటివరకు బాక్సింగ్ డే టెస్ట్‌లో జరిగిన ముఖ్యమైన ఘటనలను వివరిస్తూ బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఇండియా-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ గురించి వార్న్ ప్రస్తావించాడు.

కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన వార్న్
ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆసీస్ స్పిన్న లెజెండ్ షేన్ వార్న్ ప్రశంసలతో ముంచెత్తాడు. కోహ్లీని 'గ్రేటెస్ట్ క్రికెటర్ ఆన్ ద ప్లానెట్' అని వార్న్ సంబోధించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ 1-1తో సమమైన నేపథ్యంలో ఈసారి బాక్సింగ్ డే టెస్ట్‌కు మరింత ప్రాముఖ్యత ఉందని వార్న్ చెప్పుకొచ్చాడు.

బుధవారం నుంచి బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం సాధించగా, పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కోహ్లీసేన 146 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడో టెస్టులో మూడు మార్పులతో కోహ్లీసేన బరిలోకి దిగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications