నటరాజన్‌పై షేన్ వార్న్ ఫిక్సింగ్ ఆరోపణలు.. మండిపడుతున్న ఫ్యాన్స్

IND vs AUS 4th Test: Shane Warne Spot Fixing Remark on Natarajan | Oneindia Telugu

బ్రిస్బేన్‌: టీమిండియా సెన్సేషన్ టీ నటరాజన్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ సందేహం వ్యక్తం చేశాడు. ఈ పర్యటనలో అద్వితీయ ఆటతో ఆకట్టుకున్న అతను నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఏడు నో బాల్స్ వేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, అతని తీరు సందేహాస్పదకంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిక్సింగ్ పాల్పడ్డాడేమో అనే అనుమానం వచ్చేలా వ్యాఖ్యానించాడు. ఇక బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టిన నటరాజన్.. మూడు వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఏడు నోబాల్స్ వేసాడు. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావించిన షేన్ వార్న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

నట్టూ తీరుపై అనుమానం..

నట్టూ తీరుపై అనుమానం..

నట్టూ విషయంలో అంతా బాగున్నా ఈ నోబాల్స్‌ను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపాడు. 'నటరాజన్‌ బౌలింగ్‌ శైలి అద్భుతం. అతను వికెట్‌ తీసే విధానం అత్యద్భుతం. కానీ నో బాల్స్‌ వేయడమే బాలేదు. అతను అలా ఎక్స్‌ట్రా పరుగులిచ్చుకోవడం జీర్ణించుకోలేకపోతున్నా. టెస్టుల్లో నో బాల్స్‌ వేయడం చాలా అరుదు.. అలాంటిది నటరాజన్‌ మాత్రం ఏడు నోబాల్స్‌ వేశాడు. దీంతోపాటు ఒక ఓవర్‌ ప్రారంభంలో తొలి బంతి వేయడానికి ఏకంగా ఐదు నో బాల్స్‌ వేయడం షాక్‌కు గురి చేసింది. కొంత అనుమానస్పదంగా కూడా ఉంది.' అని షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు.

వార్న్ మతి చెడింది..

వార్న్ మతి చెడింది..

ఇక షేన్ వార్న్ వ్యాఖ్యలపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని మతి భ్రమించిందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఎంతో కష్టపడి పైకి నటరాజన్ అలాంటి బుద్ది తక్కువ పనులు చేయడని వార్న్‌కు చురకలంటిస్తున్నారు. స్థాయికి తగిన మాటలు మాట్లాడలని, ఓ యువ ఆటగాడి ఆత్మస్థైర్యం తగ్గెలా వ్యవహరించవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట దుమారం రేపుతోంది.

అనూహ్య అవకాశాలు..

అనూహ్య అవకాశాలు..

నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియా పర్యటన‌లో అడుగుపెట్టిన ఈ తమిళనాడు పేసర్.. అనూహ్య పరిణామాల మధ్య అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తొలుత వరుణ్ చక్రవర్తి గాయంతో జట్టులోకి వచ్చిన నట్టూ.. అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్కడా కూడా సత్తా చాటి టెస్ట్ టీమ్ బ్యాకప్ బౌలర్‌గా అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత సీనియర్ పేసర్లు ఒక్కొక్కరు గాయపడటంతో సిరీస్ ఆఖరి మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా అరంగేట్రం చేశాడు. ఫస్ట్ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు.

భారత్‌కు భారీ లక్ష్యం

భారత్‌కు భారీ లక్ష్యం

ఇక గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా.. భారత్‌ ముందు భారీ టార్గెట్‌ ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 294 పరుగులకు ఆలౌట్‌ అయింది. తొలి ఇన్నింగ్స్‌ ఆదిక్యం 33 పరుగులతో కలిపి ఓవరాల్‌గా టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్‌ శర్మ (4), శుభ్‌మన​ గిల్‌ (0) క్రీజులో ఉన్నారు. ఇక ఇప్పటివరకు మూడు టెస్టులు జరగ్గా.. చెరో విజయంతో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఒక టెస్టు డ్రాగా అయింది. దాంతో తాజా టెస్టు విజయం నిర్ణయాత్మకంగా మారింది. భారత్ గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్ కైవసం చేసుకుంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, January 18, 2021, 18:51 [IST]
Other articles published on Jan 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X