For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs ఆసీస్ సిరిస్ ఓవర్‌వ్యూ: ‘ప్లాన్‌-బి’ సమర్థంగా అమలు చేయలేదా?

India vs Australia series overview: Plan A in place but what about Plan B?

హైదరాబాద్: "వరల్డ్‌కప్‌కు సంబంధించి ప్లాన్‌-ఏ సిద్ధంగా ఉంది" ఆస్ట్రేలియాతో బుధవారంతో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌ను 2-3తో సిరిస్‌ను చేజార్చుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న మాటలివి. దీని అర్ధం ఏంటంటే ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో జట్టు మేనేజ్‌మెంట్ వేసుకున్న 'ప్లాన్‌-బి'ని సమర్థంగా అమలు చేయలేదన్నమాట.

అంతేకాదు ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన రెండు సిరీస్‌లనూ(టీ20, వన్డే) టీమిండియా కోల్పోవడంతో ఇంకా వరల్డ్‌కప్‌కు వెళ్లే జట్టు కూర్పుపై స్పష్టత రాలేదనే చెప్పాలి. అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు.

తప్పులు సరిదిద్దుకునేందుకు

తప్పులు సరిదిద్దుకునేందుకు

"ప్రపంచ కప్‌కు ముందు తప్పులు సరిదిద్దుకునేందుకు ఇలాంటి ఓటములు మంచిదే. మా లోపాలను సరి చేసుకుంటాం. సిరీస్‌ కోల్పోయినా మా ఆటతీరుపై సంతృప్తిగానే ఉన్నా. చివరి మూడు వన్డేల్లో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించాం. అయితే ఓటమికి మార్పులు కారణం కాదు. వరల్డ్‌ కప్‌కు ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసం మాలో ఉంది" అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఎలాంటి సమస్యలు లేవు

ఎలాంటి సమస్యలు లేవు

"జట్టు కూర్పుకు సంబంధించి దాదాపుగా ఎలాంటి సమస్యలు లేవు. మహా అయితే ఒక స్థానం(నాలుగు) గురించి మాత్రమే కాస్త ఆలోచించాల్సి ఉంది. పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హార్దిక్‌ పాండ్యా పునరాగమనంతో జట్టు బ్యాటింగ్‌ బలపడుతుంది. అలాగే బౌలింగ్‌ విభాగంకు కూడా మద్దతుగా ఉంటుంది" అని కోహ్లీ తెలిపాడు.

ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం

ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం

కోహ్లీ చెప్పిన మాటలను బట్టి ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం వచ్చినట్లు కనబడుతోంది. విజయ్‌ శంకర్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్యా వరల్డ్‌కప్‌ జట్టుకి ఎంపిక చేయడం అనేది దాదాపు ఖాయమైందనే విషయం కోహ్లీ మాటల్లో వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌ ద్వారా చాలా ప‍్రశ్నలకు సమాధానం దొరకలేదనే చెప్పాలి.

నాలుగో నంబర్‌ ఎవరిది?

నాలుగో నంబర్‌ ఎవరిది?

వాటిలో ఒకటి నాలుగో నంబర్‌ కాగా, రెండోది మూడో ఓపెనర్‌ ఎవరనేది. అదే సమయంలో రెండో వికెట్‌ కీపర్‌గా ఎవర‍్ని తీసుకోవాలనే దానిపై కూడా స్పష్టంగా తెలియరాలేదు. ఆ తర్వాత నాలుగు పేసర్‌గా స్థానం ఎవర్ని తీసుకుంటారో అనేది ఇంకా ప్రశ్నార్థంగానే ఉండగా, జడేజా పూర్తిస్థాయిలో ఆకట్టకోలేకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌ని అయోమయానికి గురి చేసింది.

ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి

ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి

ఇక, ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి జరగనున్న వరల్డ్‌కప్‌ రౌండ్‌ రాబిన్‌ విధానం జరగనుంది. మొత్తం పది జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ఒక జట్టు మిగతా తొమ్మిది జట్లతో తలపడుతుంది. కోహ్లీసేన సెమీస్‌ చేరాలంటే కనీసం ఆరు మ్యాచ్‌ల్లో గెలవాలి. అయితే, ఆస్ట్రేలియాతో టీమిండియా 2-3తో సిరిస్‌ను చేజార్చుకోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.

రెండు సెంచరీలు చేసిన కోహ్లీ

రెండు సెంచరీలు చేసిన కోహ్లీ

ఐదు వన్డేల సిరిస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (310) వరుసగా రెండు సెంచరీలతో చెలరేగాడు. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (202) కూడా రెండు హాఫ్ సెంచరీలతో ఫరవాలేదనిపించాడు. అయితే, మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌ మాత్రం నిరాశపరిచారు. మొదటి మూడు మ్యాచ్‌లు ఆడిన ధోని కీపింగ్‌లో అదరగొట్టినప్పటికీ బ్యాటింగ్‌ పరంగా ఇంకా రాణించాల్సి ఉంది.

10 వికెట్లు తీసిన పరుగులిచ్చిన కుల్దీప్

10 వికెట్లు తీసిన పరుగులిచ్చిన కుల్దీప్

ఈ సిరిస్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 10 వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏడు వికెట్లు మాత్రమే తీసినప్పటికీ పరుగులు కట్టడి చేశాడు. జడేజా నాలుగు మ్యాచుల్లో మూడు వికెట్లు తీసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో వీరి ప్రదర్శనలను చూస్తుంటే టీమిండియా వరల్డ్‌కప్‌ పర్యటనకు వెళ్లేముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.

అంబటి రాయుడు విఫలం

అంబటి రాయుడు విఫలం

జట్టులో నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై ఇంకా స్పష్టత రాలేదు. అంబటి రాయుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన సిరిస్‌లో అతడి ప్రదర్శన పేలవంగా ఉంది. ఆసీస్‌తో సిరిస్‌కు ముందు జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు సెలక్టర్లు కేఎల్‌ రాహుల్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తామని చెప్పింది.

పాండ్యా వైపే కోహ్లీ మొగ్గు

పాండ్యా వైపే కోహ్లీ మొగ్గు

అయితే, నాలుగో మ్యాచ్‌ల్లో ఎందుకు ఆడించలేదో తెలియదు. రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బరిలోకి దిగినప్పటికీ రాణించలేదు. వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యే జట్టులో దినేశ్‌ కార్తీక్‌, యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ మధ్యే నాలుగో స్థానానికి పోటీ ఉండొచ్చని తెలుస్తోంది. విజయ్‌ శంకర్‌ ఫరవాలేదనిపించిన కోహ్లీ మాత్రం హార్దిక్‌వైపు మొగ్గు చూపుతాడు. దీనిని బట్టి చూస్తుంటే వరల్డ్‌కప్‌లో ఆడే ఆ 15 మందిపై ఇప్పటికీ స్పష్టతకు వచ్చినటన్లు లేరు. ఏప్రిల్‌ 20న జట్టుని ప్రకటించే వరకు ఎవరుంటారో ఎవరు ఉండరో చెప్పలేం.

Story first published: Thursday, March 14, 2019, 17:48 [IST]
Other articles published on Mar 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+