హైదరాబాద్: టెస్టు ఫార్మాట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న కోహ్లీసేన వన్డేల్లోనూ అగ్రస్థానం చేజిక్కించుకునేందుకు గొప్ప అవకాశం వచ్చింది. సెప్టెంబర్ 17 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ఐదు వన్డేల సిరిస్‌ను కోహ్లీసేన 4-1తో గెలవగలితే టీమిండియా నెంబర్ వన్ స్ధానాన్ని సొంతం చేసుకుంటుంది.
ప్రస్తుతం 119 పాయింట్లతో వన్డే ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్, ఆస్ట్రేలియా జట్లు సంయుక్తంగా 117 పాయింట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఎలాంటి వన్డే సిరీస్‌లు ఆడకపోవడంతో అగ్రస్థానం కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి.

ఇటీవల ఐదు వన్డేల సిరీస్‌లో శ్రీలంకని క్లీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు.. ఆస్ట్రేలియాని కూడా 5-0తో క్లీన్‌స్వీప్ చేయగలిగితే ఖాతాలో 122 పాయింట్లు చేరి అగ్రస్థానానికి ఎగబాకుతుంది. అప్పుడు ఆసీస్ 113 పాయింట్లకి పడిపోతుంది. ఒకవేళ 4-1 తేడాతో ఓడిస్తే 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాని వెనక్కి నెడుతుంది.
ఇక ఐదు వన్డేల సిరిస్‌ను 3-2 తేడాతో గెలిస్తే, 118 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
Scenarios:
• India beats Australia 5-0 - India 122, Australia 113
• India beats Australia 4-1 - India 120, Australia 114
• India beats Australia 3-2 - India 118, Australia 116
• Australia beats India 3-2 - Australia 118, India 116
• Australia beats India 4-1 - Australia 120, India 114
• Australia beats India 5-0 - Australia 122, India 112
Schedule for ODI series:
• September 17: First ODI, Chennai
• September 21: Second ODI, Kolkata
• September 24: Third ODI, Indore
• September 28: Fourth ODI, Bangalore
• October 1: Fifth ODI, Nagpur