చివరి వరకు క్రీజులో ఉండేందుకు ఇష్టపడే ఆటగాడు: ధోనిపై సచిన్

హైదరాబాద్: రెండో వన్డేలో ధోని అద్భుతంగా ఆడాడని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొనియాడాడు. గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో ధోని విమర్శలను ఎదుర్కొంటోన్న సంగతి తలిసిందే. ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో ధోని 96 బంతుల్లో 51 పరుగులు చేసినప్పటికీ అతడిపై విమర్శలు ఆగలేదు.
ఎప్పుడో ఒకసారి బాగా ఆడడం కాదు.. టీమిండియాను గెలిపించేలా ఆడాలి అంటూ విమర్శలు వచ్చాయి. అయితే, మంగళవారం అడిలైడ్ వేదికగా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి, తనను విమర్శిస్తున్న వారు సైతం ప్రశంసించేలా చేసుకున్నాడు.

ధోని బాగా ఆడాడు
ఈ నేపథ్యంలో సచిన్ మాట్లాడుతూ "రెండో వన్డేలో ధోని బాగా ఆడాడు. తొలి మ్యాచ్‌లో కాస్త ఇబ్బంది పడ్డాడు. బంతిని అనుకున్నట్లుగా కొట్టలేకపోయాడు. కానీ రెండో వన్డేలో మొదటి బంతి నుంచి భిన్నంగా కనిపించాడు. ధోని పిచ్‌ను అర్థం చేసుకోవడం కోసం ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఆడతాడు. పరుగుల కోసం పెద్దగా ప్రయత్నించడు" అని అన్నాడు.

ఇద్దరు వికెట్‌కీపర్లు
చివరి వరకు క్రీజులో ఉండేందుకు ఇష్టపడే ఆటగాడు ధోని. రెండో వన్డేలోనూ అదే చేశాడు. అతడు ఓ ఎండ్‌లో పాతుకుపోయి ఆటను తన అధీనంలోకి తీసుకొస్తాడు" అని సచిన్ చెప్పుకొచ్చాడు. రెండో వన్డేలో దినేశ్ కార్తీక్ కూడా చక్కగా ఆడాడని.... ధోని, కార్తీక్ రూపంలో ఇద్దరు వికెట్‌కీపర్లు జట్టులో ఉన్న నేపథ్యంలో పంత్‌కు చోటు దక్కడం కష్టమని సచిన్ అన్నాడు.

జట్టును గెలిపించడానికి
కొత్త పేసర్లు మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్‌ల విషయంలో అభిమానులు ఓపిక పట్టాలని సచిన్ సూచించాడు. వాళ్లను ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తే.. జట్టును గెలిపించడానికి ప్రయత్నించే బదులు, పరుగులివ్వకుండా ఉండడంపై దృష్టిపెడతారని సచిన్ ఈ సందర్భంగా తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications