Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుజారా 'సైలెంట్ వారియర్': సచిన్, ఐపీఎల్ 10లో చోటు?

హైదరాబాద్: ఈ హోం సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఛటేశ్వర్ పూజారాపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. పూజారా ఓ 'సైలెంట్ వారియర్' అని సచిన్ కితాబిచ్చాడు.

'పుజారా సైలెంట్ వారియర్. ఆట పట్ల అతని దృక్పథం, అంకితభావం అమోఘం. ఆరంభం నుంచి పుజారా క్రమశిక్షణ, నేర్చుకునేతత్వం నచ్చింది. అప్పుడే అనుకున్నా అతను ఎక్కువకాలం జట్టులో కొనసాగుతాడు' అని సచిన్ అన్నాడు. ఈ ఏడాది హోం సీజన్‌లో పూజారాతో పాటు ఉమేశ్‌ యాదవ్‌ కూడా ఆకట్టుకున్నాడని సచిన్ పేర్కొన్నాడు.

భారత గడ్డపై రివర్స్‌ స్వింగ్‌ చేసే సత్తా ఉన్న ఏ బౌలరైనా రాణిస్తాడని, భారత్‌లో ఒక పేసర్‌ వరుసగా 12 టెస్టులు ఆడడం కూడా ప్రస్తుతం గొప్ప విషయమేనని ఉమేశ్ యాదవ్‌ని ఉద్దేశించి సచిన్ అన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టుల సిరిస్‌లో పుజారా అరుదైన రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే.

పుజారా సరికొత్త రికార్డు

పుజారా సరికొత్త రికార్డు

ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆస్ర్టేలియాతో నాలుగో టెస్టులో చేసిన అర్ధ సెంచరీ (57)తో పుజారా 2016-17 సీజన్‌లో 1316 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 2008-09 సీజన్‌లో గౌతమ్‌ గంభీర్‌ 1269 పరుగులతో నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును పుజారా అధిగమించాడు.

రికీ పాంటింగ్‌ తర్వాత రెండో స్ధానంలో

రికీ పాంటింగ్‌ తర్వాత రెండో స్ధానంలో

కాగా మొత్తంగా ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (1483) తర్వాతి రెండో స్ధానంలో పుజారా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ఉమేశ్ యాదవ్ సైతం ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరిస్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసాడు.

17 వికెట్లు తీసుకుని కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు

17 వికెట్లు తీసుకుని కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు

నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఉమేశ్ యాదవ్ 17 వికెట్లు తీసుకుని కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను సాధించాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో పుజారాను ఏ ఒక్క ప్రాంచైజీ కూడా కొనుగోలు చేయని సంగతి తెలిసిందే. అయితే కీలక ఆటగాళ్లు గాయాలతో లీగ్‌కు దూరమైన నేపథ్యంలో పుజారాకు ఛాన్స్ లభించొచ్చని ఐపీఎల్‌ వర్గాలు చెబుతున్నాయి.

పుజారాను ఏదో ఒక ఫ్రాంఛైజీ తీసుకునే అవకాశాలు

పుజారాను ఏదో ఒక ఫ్రాంఛైజీ తీసుకునే అవకాశాలు

మురళీ విజయ్‌, కేఎల్‌ రాహుల్‌, జెపి డుమిని, డికాక్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌ వివిధ కారణాలతో లీగ్‌కు అందుబాటులో లేని నేపథ్యంలో పుజారాను ఏదో ఒక ఫ్రాంఛైజీ తీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రూ.50 లక్షల కనీస ధరతో రేసులో నిలిచిన పుజారాను ఏ ఫ్రాంఛైజీ తీసుకోలేదు. ఇప్పుడు కొంచెం తక్కువ మొత్తానికి అతను ఏదో ఒక ఫ్రాంఛైజీతో అతను ఒప్పందం చేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+