టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే పెర్త్ లాంటి పిచ్‌లు అవసరం: సచిన్

ముంబై: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన పెర్త్ పిచ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. ఇటువంటి పేలవ రేటింగ్ ఇవ్వడంపై సచిన్ టెండూల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అది చాలా మంచి పిచ్ అని.. బ్యాట్స్‌మెన్, బౌలర్ల నైపుణ్యాన్ని పరీక్షించిందని అన్నాడు. పెర్త్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 146 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో ఆసీస్ సమం చేసింది. తొలి రెండు టెస్టులకు మ్యాచ్ రిఫరీగా మదుగలేను ఐసీసీ నియమించింది.

అడిలైడ్ పిచ్‌కు ‘వెరీ గుడ్' రేటింగ్ ఇచ్చి
భారత్ విజయం సాధించిన తొలి మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన అడిలైడ్ పిచ్‌కు ‘వెరీ గుడ్' అని రేటింగ్ ఇచ్చిన మదుగలే.. పెర్త్ పిచ్‌కు మాత్రం ‘యావరేజ్' అని రేటింగ్ ఇచ్చారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేసింది. పెర్త్ పిచ్, ఔట్ ఫీల్డ్ సాధారణంగా ఉందని మదుగలే రేటింగ్ ఇచ్చినట్లు పేర్కొంది. ఈ రేటింగ్‌పై ఇప్పటికే సీనియర్ క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆదివారం సచిన్ కూడా స్పందించారు.
టెస్టు క్రికెట్లో పిచ్‌లు కీలక పాత్ర
‘క్రికెట్లో, ముఖ్యంగా టెస్టు క్రికెట్లో పిచ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. టెస్టు క్రికెట్‌కు పూర్వవైభవం తేవడానికి, ఈ ఫార్మాట్‌పై ఆసక్తి పెంచడానికి పెర్త్ పిచ్ లాంటి పిచ్‌లను మరిన్ని తయారు చేయాలి. ఇలాంటి పిచ్‌లపైనే బ్యాట్స్‌మెన్, బౌలర్ల ప్రతిభ నిజంగా బయటపడుతుంది. ఇలాంటి పిచ్‌ను ‘యావరేజ్' అనడంలో అర్థంలేదు' అని సచిన్ ట్వీట్ చేశాడు.

ఈ ఏడాది నుంచే పిచ్‌లకు రేటింగ్ ఇస్తూ
ఒక్క సచినే కాదు.. పెర్త్ పిచ్‌కు తక్కువ రేటింగ్ ఇచ్చినందుకు చాలా మంది ఐసీసీని తప్పు పట్టారు. పెర్త్ పిచ్ యావరేజ్ కాదంటూ ట్వీట్ చేశారు. కాగా, టెస్టులకు ఆతిథ్యమిచ్చే పిచ్‌ల నాణ్యతను పెంచడానికి వాటికి రేటింగ్‌లు ఇచ్చే పద్ధతిని ఈ ఏడాది మొదటి నుంచే ఐసీసీ తీసుకొచ్చింది. పిచ్‌ల నాణ్యత ఆధారంగా వెరీ గుడ్, గుడ్, యావరేజ్, బిలొవ్ యావరేజ్, పూర్ అనే రేటింగ్‌లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, మెల్‌బోర్న్, సిడ్నీల్లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే చివరి రెండు టెస్టులకు జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications