
పుట్ బాల్ ఆడిన కోహ్లీసేన
ఐదు వన్డేల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకున్న కోహ్లీసేన మిగతా రెండు వన్డేల్లో కూడా విజయం సాధించి ఆసీస్‌ను వైట్ వాష్ చేయాలని తహతహలాడుతోంది. ఇందులో భాగంగా మంగళవారం కోహ్లీ సేన తీవ్రంగా చెమటోడ్చింది. కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టులోని ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఫుట్‌బాల్ ఆడారు.

అద్భుతమైన పాస్‌లతో అలరించిన కోహ్లీ
ప్రాక్టీస్ సెషన్‌లో కొద్దిసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన కోహ్లీ ఆ తర్వాత ఫుట్‌బాల్‌లోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని అద్భుతమైన పాస్‌లతో అలరించాడు. అతను కొట్టిన ఓ బంతి తృటిలో గోల్‌పోస్ట్ బయటకు వెళ్లడంతో కోహ్లీ నిరాశను వ్యక్తం చేశాడు.

ధోనీ, కోహ్లీ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్
మరోవైపు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న టీమిండియాకు చూసేందుకు చిన్నసామి స్టేడియానికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అనంతరం ధోనీ, పాండ్యా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఎక్కువగా భారీ షాట్లను కొట్టేందుకు ప్రయత్నించారు. కుల్దీప్ బౌలింగ్‌లో పాండ్యా రెండు సిక్సర్లు బాదాడు.

గురువారం జరిగే ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు
షమీ, ఉమేశ్ కాసేపు బౌలింగ్ వేశారు. అక్షర్ పటేల్ వికెట్ల మధ్య పరుగెత్తడం ప్రాక్టీస్ చేశాడు. గురువారం జరిగే ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. మంగళవారం బెంగళూరులో చిరు జల్లులతో కూడిన వర్షం పడింది. ఆరు గంటలకు పైగా చిన్న జల్లులు పడటంతో మైదానం సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.

ఆసీస్ జట్టు కూడా నెట్స్‌లో ప్రాక్టీస్
ఇక మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు స్టేడియానికి వచ్చిన ఆసీస్ జట్టు కూడా నెట్స్‌లో కాసేపు ప్రాక్టీస్ చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ పిచ్‌ని పరిశీలించాడు. అనంతరం సహచర క్రికెటర్లతో కలిసి మంతనాలు జరిపాడు. ఆ తర్వాత కాసేపు మైదానంలో కసరత్తులు చేశారు. వార్మప్ ముగిసిన తర్వాత రెండు ప్రాక్టీస్ పిచ్‌లపై ఆసీస్ బ్యాట్స్‌మెన్ సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.


Click it and Unblock the Notifications











