Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అడిలైడ్‌లో రోహిత్ సిక్సుల మోత: ఇంప్రస్ కాని నెటిజన్లు (వీడియో)

India vs Australia: Rohit Sharma Throws Away His Wicket In Adelaide, Twitter Is Not Impressed

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మకు జట్టు మేనేజ్‌మెంట్ తుది జట్టులో చోటు కల్పించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే, రోహిత్ శర్మ ఔటైన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

రహానే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్

రహానే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ వన్డే మాదిరి బ్యాటింగ్‌‌లో చెలరేగాడు. ఈ క్రమంలో స్పిన్నర్ నాథన్ లియాన్ వేసిన ఇన్నింగ్స్ 38వ ఓవర్‌లో సిక్స్ బాదిన రోహిత్ శర్మ.. తర్వాత బంతిని కూడా సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి మార్కస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో జట్టు స్కోరు 86 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్‌ కావడంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది.

విహారీపై వేటు వేసి రోహిత్ శర్మకు చోటు

నిజానికి తొలి టెస్టు కోసం బీసీసీఐ బుధవారం 12 మందితో కూడిన భారత్ జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గురువారం తుది జట్టులో హనుమ విహారిపై వేటు వేసిన జట్టు మేనేజ్‌మెంట్ తుది జట్టులో రోహిత్‌కి అవకాశమిచ్చింది. దీంతో టెస్టుల్లో మెరుగైన రికార్డు లేని రోహిత్‌కి ఎలా అవకాశమిస్తారు? అని నెటిజన్లు మండిపడుతున్నారు.

సఫారీ గడ్డపై చివరగా టెస్టు ఆడిన రోహిత్

సఫారీ గడ్డపై చివరగా టెస్టు ఆడిన రోహిత్

ఈఏడాది జనవరిలో సఫారీ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ.. ఆ పర్యటనలో పేలవంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్‌లో రెండు టెస్టులాడి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసిన పరుగులు 78 మాత్రమే చేశాడు. దీంతో ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌తో సిరీస్‌లకి రోహిత్‌ని ఎంపిక చేయకుండా సెలక్టర్లు పక్కన పెట్టేశారు.

 వన్డే, టీ20 సిరీస్‌ల్లో సెంచరీల

వన్డే, టీ20 సిరీస్‌ల్లో సెంచరీల

ఇటీవల ఆసియా కప్, వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో సెంచరీల మోత మోగించిన రోహిత్ శర్మకి మరోసారి ఆస్ట్రేలియా గడ్డపై సెలక్టర్లు అవకాశమిచ్చారు. దీంతో ఇంగ్లాండ్‌‌పై టెస్టు సిరీస్‌‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసి హాఫ్ సెంచరీ బాదడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టిన హనుమ విహారి బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది.

1
43623
Story first published: Thursday, December 6, 2018, 13:05 [IST]
Other articles published on Dec 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+